PS Telugu News
Epaper

“భూమిపై రైతుకు భరోసా కల్పించేందుకే ప్రభుత్వ రాజముద్రణతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు.”

📅 08 Jan 2026 ⏱️ 4:01 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి.

భూమిపై రైతుకు భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ రాజముద్రణతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తున్నారని, గత వైసీపీ
వై ఎస్ జగన్ పాలనలో ఫోటోల పిచ్చితో రైతులను ఆగం చేశారని, రైతుల ఇళ్ల వద్దకే అధికారులు వచ్చి పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం మా మంచి ఉమ్మడి ప్రభుత్వంకే దక్కిందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.
నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం మిడ్తూరు మండలం తిమ్మాపురం గ్రామంలో గురువారం కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి రైతులకు పంపిణి చేశారు.
ఈ సందర్బంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు రెవెన్యూ వ్యవస్థను ప్రక్షళన బాట పట్టించి, రాజముద్రణతో కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు అందిస్తున్నారనీ, ఏడాదిలోనే రెవెన్యూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ఆమె అన్నారు. గత ఐదేళ్ల జగన్ ప్రభుత్వంలో భూముల రీసర్వే పేరుతో రెవెన్యూ వ్యవస్థను భ్రష్టుపట్టించారని ఆమె విమర్శించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ భూముల హద్దురాళ్లపై కూడా జగన్ ఫోటోలు ముద్రించి తన పైశాచిక ఆనందం పొందారని విమర్శించారు. రాష్ట్రంలో రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామన్నారు. నంద్యాల జిల్లాలో 51,017 రాజముద్రణతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వివరించారు. కొత్త పాస్ పుస్తకాలు ప్రభుత్వ రాజముద్రణతో పాటు క్యూ ఆర్ కోడ్ తో భారత దేశంలో ఎక్కడా లేని విధంగా ఆధునిక సాంకేతికతతో చంద్రబాబు ప్రభుత్వం ముద్రించడం జరిగిందన్నారు. రైతులు క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే భూమికి సంబంధించిన పూర్తి వివరాలు కనిపిస్తాయని, ఏవైనా తప్పులు ఉంటే వెంటనే అధికారులకు తెలియజేస్తే ఉచితంగా సరిదిద్దుతూ కొత్త పాస్ పుస్తకాలు జారీ చేయడం జరుగుతుందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. ఈ కార్యక్రమంలో మిడ్తూరు తహసీల్దార్ టీ. శ్రీనివాసులు, వి ఆర్ ఓప్రసాదరావు, డిప్యూటీ ఎంపీడీఓ సురేష్, టీడీపీ సీనియర్ నాయకులు చెరుకుచెర్ల రఘురామయ్య, తిమ్మాపురం టీడీపీ నాయకులు శ్రీనివాస రెడ్డి, మాజీ జడ్పీటీసీ నాగేశ్వరావు, మిడ్తూరు భగీరథ రెడ్డి, జలకనూరు స్వామిరెడ్డి, శేషిరెడ్డి, కొనేటమ్మ పల్లె రఘురామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top