PS Telugu News
Epaper

మహాత్మా గాంధీ జాతిగా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలి

📅 09 Jan 2026 ⏱️ 5:30 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్

—- జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కట్పల్లి నగేష్ రెడ్డి పత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగేష్ రెడ్డి మాట్లాడుతూ 2004లో సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ గా సోనియాగాంధీ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణ ప్రాంతం మెదక్ జిల్లాలో,ఆంధ్రా ప్రాంతం అనంతపూర్ లో పర్యటించినప్పుడు కొన్ని గ్రామాలలో ఇండ్లకు తాళాలు ఉండడం చూసి ఎందుకు అని తెలుసుకున్నప్పుడు అక్కడ ఉండే వారు ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వలస వెళ్లడం జరిగిందని, దీనిని గ్రహించిన కాంగ్రెస్ ప్రభుత్వం వలసలను నివారించడానికి గ్రామాలలో ఉపాధి కల్పించడానికి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగిందని, దానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని పేరు పెట్టడం జరిగిందని,ఆ పతకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 100 రోజుల ఉపాధి కల్పిస్తూనే ఏ పని చేయాలనేది, 365 రోజుల్లో ఏ రోజు పని చేయాలనేది దానిని కూడా గ్రామస్థాయిలో సర్పంచులు గ్రామ ప్రజలు కలిసి గ్రామ సభలు ఏర్పాటు చేసుకుని నిర్ణయించుకునే వెసులుబాటును అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందన్నారు. కానీ ప్రస్తుతం బిజెపి ప్రభుత్వం ఆ పథకాన్ని పేరు మారుస్తూనే దానిని నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని, ఉపాధి హామీ పనిలో 100 రోజులు పని దినం ఉన్నదానినీ 125 రోజులు చేస్తున్నామని బిజెపి నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని కానీ వాస్తవానికి బిజెపి ప్రభుత్వం చేసిన 125 రోజుల పనిలో 75 రోజులు మాత్రమే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తుందని, మిగతా 50 రోజులు పని భారాన్ని రాష్ట్రాలపై మోపారని నగేష్ రెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ గారి పేరును తీసివేసి జి రామ్ జి అని పేరు పెట్టి పథకాన్ని నీరు గార్చే విధంగా బిజెపి చేసిందని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అసెంబ్లీలో పూర్తిస్థాయిలో వ్యతిరేకించడం జరిగిందని, ఏదైతే కేంద్ర ప్రభుత్వం 125 రోజులు పని దినాల్లో కేవలం 75 రోజులు మాత్రమే కేంద్ర భరిస్తుంది అని, 50 రోజులు రాష్ట్రం భరించాలని చెప్పిన దానిని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించిందని,పూర్తిగా 125 రోజుల పని దినాల భారాన్ని కేంద్రమే భరించాలని,తిరిగి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలనీ తీర్మానం చేయడం జరిగింది. రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో నిజామాబాద్ జిల్లాలోని ఆరు నియోజకవర్గాలలోని అన్ని గ్రామాలలో ఈనెల 20 నుండి 30 తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్చి ఏ విధంగా అన్యాయం చేస్తుందో ప్రజలకు వివరించాలని, అదేవిధంగా 125 రోజుల పని దినాన్ని మొత్తం కేంద్రమే భరించాలని ప్రతి గ్రామంలో గ్రామ సర్పంచులు తీర్మానం చేయాలని నగేష్ రెడ్డి కోరారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం తప్పుడు మాటలతో అధికారంలోకి వచ్చిందని నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నీరుద్యోగులను మోసం చేయడం జరిగిందని, నల్లధనం బయటకు తీస్తానని ప్రతి పేదవానికి 15 లక్షలు చెప్పి ప్రజలను మోసం చేయడం జరిగిందని, కేంద్రంల బిజెపి పార్టీ లోక్ సభలో బలం ఎక్కువ ఉంది అని రాజ్యసభకు పంపి పథకాన్ని అమలు చేసిన విధానాన్ని దేశంలో 140 కోట్ల మంది ప్రజలు వ్యతిరేకిస్తుంది అని, 2029లో కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత పథకాన్ని తిరిగి పునరుద్ధరిస్తామని, ఈ పోరాటం ఇంతటితో ఆగదని గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో నిరసనలు చేస్తామని తెలిపారు, గ్రామ సభలు నిర్వహించి దీనిని వ్యతిరేకిస్తామని, గ్రామాలలో 80 శాతం మంది ప్రజలు ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారని, బిజెపి ప్రభుత్వం ఈ పథకం ద్వారా పేద ప్రజలకు అన్యాయం చేస్తూనే కార్పొరేట్ సంస్థలకు లాభం చేయాలని చూస్తుందని, మహాత్మా గాంధీ పేరు ఉందని కారణంతో ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయాలని కుట్రను బిజెపి చేస్తుందని, ఇప్పటికే చాలామంది గ్రామాలలో దీనిని వ్యతిరేకిస్తున్నారని ఇప్పటికైనా బిజెపి కొత్తగా తీసుకు వచ్చిన పథకాన్ని రద్దుచేసి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించారని జిల్లా కాంగ్రెస్ పార్టీ మరియు నగర కాంగ్రెస్ పార్టీ తరఫున నగేష్ రెడ్డి డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ,మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి,వర్ని ఏ ఎం సి చైర్మన్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు సురేష్ బాబా,జిల్లా కాంగ్రెస్ సెల్ అధ్యక్షులు యాదగిరి,జిల్లా ఓబీసీ అధ్యక్షులు రాజా నరేందర్ గౌడ్,జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్,నగర మైనారిటీ అధ్యక్షులు ఎజాస్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఈసా, మోపాల్ మండల అధ్యక్షులు సాయిరెడ్డి,సర్పంచ్ కిసాన్,నరేందర్ గౌడ్, గణేష్,సర్పంచ్ జనార్దన్, అష్రఫ్ మరియు తదితరులు పాల్గొన్నారు

Scroll to Top