శ్రీ సరస్వతి శిశుమందిర్ గుజిరి గల్లి లో ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి.
ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని ఉంటాయి. ఈ కార్యక్రమంలో భోగిమంటలు గంగిరెద్దులు,పంట పొలం,బొమ్మల కొలువు,ముగ్గుల పోటీలు మరియు పిల్లలు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పాఠశాలలో కేవలం విద్యనే కాకుండా మన జాతీయ పండుగలను మరియు మన రాష్ట్ర పండుగలను వాటి గొప్పతనాన్ని విశిష్టతను పిల్లలకి తెలియజేస్తూ విద్యతోపాటు అన్ని రంగాల్లో మంచి జ్ఞానాన్ని అందిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పురుస్తూ గోపాల్ మరియు మార్కెట్ డైరెక్టర్ తోటరాము
ప్రిన్సిపాల్ గంగాధర్ ఉపాధ్యాయులు బృందం పిల్లలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
