PS Telugu News
Epaper

వివేకానంద నగర్ కాలనీలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు

📅 12 Jan 2026 ⏱️ 5:59 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 12 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి

స్వామి వివేకానంద జయంతి వేడుకలు వివేకానంద నగర్ కాలనీ మెయిన్ రోడ్ లో స్వామి వివేకానంద విగ్రహం దగ్గర జయంతి వేడుకలకు ముఖ్య అతిథి శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పిఎసి చైర్మన్ పాల్గొని స్వామి వివేకానంద పూలమాల వేశారు ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ స్వామి వివేకానందుని ఆదర్శంగా యువత మంచి మార్గంలో ఉండాలని స్వామి వివేకానంద స్ఫూర్తితో మంచి మార్గంతో ముందుకు వెళ్లాలని ప్రపంచ దేశాలకు తెలియజేశారు యువత స్వామి వివేకానందుని అడుగుజాడల్లో ఉండాలని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ సీనియర్ నాయకులు చంద్రకాంతరావు సంజీవరెడ్డి పాల్గొని వివేకానందునికి పూలమాలలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో చంద్రకాంత్ చంద్రకాంత్ స్వీట్లు పండ్లు అందజేయడం జరిగింది కార్యక్రమంలో రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురంధర్ రెడ్డి జి ప్రసాద్ మల్లయ్య విద్యా కల్పన ఏకాంత గౌడ్ శ్రీధర్ సూర్యనారాయణ తదితరులు స్వామి వివేకానంద జయంతి వేడుకలకు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరుపేరునా అభినందనలు జే పురంధ రెడ్డి తెలిపారు

Scroll to Top