PS Telugu News
Epaper

కళ్యాణ లక్ష్మి చెక్కులు మండల రెవెన్యూ అధికారి ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేయాలి.

📅 12 Jan 2026 ⏱️ 6:51 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్

ప్రశాంత్ రెడ్డి అహంకారాన్ని ప్రదర్శించవద్దు. ప్రజా పాలనలో అహంకారానికి చోటు లేదు. ప్రశాంత్ రెడ్డికి ప్రజా ప్రభుత్వం ప్రోటోకాల్ గౌరవాన్ని ఇచ్చింది. ఆ గౌరవాన్ని అతను కాపాడుకుంటే మంచిది.ప్రజా ప్రభుత్వంలో ప్రజలను రాజకీయ నాయకుల ఇంటి చుట్టూ తింపుకునే కుసంస్కారం ఛిద్రం అయింది.కళ్యాణ లక్ష్మి దరఖాస్తులను నేరుగా మండల తహసీల్దార్ కె సమర్పించే వెసులుబాటును కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. గత ప్రభుత్వంలో సంవత్సరం దాటిన చెక్కులు మంజూరు కాలేదు కానీ ఈ ప్రభుత్వంలో దరఖాస్తు చేసిన రెండు నెలలోపు చెక్కులు మంజూరు అవుతున్నాయి గతంలో కల్యాణలక్ష్మి దరఖాస్తు చేసుకోవాలంటే ఎమ్మెల్యే ఇంటి చుట్టు అవమానాలు పడి తిరగాల్సి వచ్చేది.ప్రశాంత్ రెడ్డి ఏ మండలం చెక్కులు ఆ మండలంలోనే పంచాలి. నియంతల వ్యవహరించి అందరు నా దగ్గరకు రావాలంటే కుదరదు. ఎమ్మార్వో లను బెదిరించి చెక్కులను ఆపడం సబబు కాదు. ఒకసారి పంచాక కూడ రాని వారి చెక్కులు ఇవ్వద్దు వారందరూ నా ఇంటికే వచ్చి చెక్కులు తీసుకోవాలి అనే అహంకారం ప్రదర్శించొద్దు. రానివారు వ్యవసాయ పనులు, ఆరోగ్య సమస్యలు, ఏదైనా సమస్యలు ఉండవచ్చు

Scroll to Top