బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి ఉత్సవాలకు స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కు ప్రత్యేక ఆహ్వానం..
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి.
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో రానున్న వసంత పంచమి ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కు ఆలయ అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మరియు అర్చకులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బాసర ఆలయం రాష్ట్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోందని, వసంత పంచమి వంటి పవిత్ర పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం ఆనందకరమని తెలిపారు. వసంత పంచమి మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులకు మౌలిక సదుపాయాలు అందించాలని, క్యూ లైన్ లో నిలబడిన స్త్రీలకు అక్కడక్కడ ఫిడింగ్ రూమ్ ఏర్పాటు చేయాలని, ఏటువంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను సూచించారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
