PS Telugu News
Epaper

కడియాల కుంట తండాలో షూటింగ్ సందడి

📅 13 Jan 2026 ⏱️ 6:09 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

సేవాలాల్ జీవిత చరిత్ర సాంగ్స్ షూటింగ్

రాత్లావత్ శంకర్ నాయక్ స్వయంగా రచించి నిర్మిస్తున్న సాంగ్

పాల్గొన్న సర్పంచ్ రాజు నాయక్ చౌహాన్ మరియు మాజీ సర్పంచ్ బుజ్జీ రాజు నాయక్

( పయనించే సూర్యుడు జనవరి 13 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )

ఫరూక్నగర్ మండలం కడియాలకుంట తండా లోని సేవాలాల్ మరియు మేరమ యాడి గుడిలో ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ సేవాలాల్ జీవిత చరిత్రకు సంబంధించిన సాంగ్ చిత్రీకరణ ఘనంగా జరిగింది. కడియాల కుంట తండకు చెందిన రాత్లావత్ శంకర్ నాయక్ స్వయంగా రాసి నిర్మిస్తున్న సాంగ్ కావడంతో తండావాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం శంకర్ నాయక్ మాట్లాడుతూ…తమ ఆరాధ్య దైవమైన సేవాలాల్ జీవిత చరిత్ర సాంగ్ రాయడం మరియు వీడియో సాంగ్స్ చేయడం నాకు చాలా గొప్పగా ఉందని అన్నారు . ఈ పాటకి కొరియోగ్రాఫర్ గా షాద్నగర్ కు చెందిన శివ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్ టీవీ రంగయ్య పర్యవేక్షణలో సాంగ్స్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తండ సర్పంచ్ రాజు నాయక్ చౌహాన్ మరియు డిప్యూటీ సర్పంచ్ తావు సింగ్ నాయక్ మరియు మాజీ సర్పంచ్ బుజ్జీ రాజు నాయక్, వార్డ్ సభ్యులు తావు సింగ్ నాయక్, చాట్ పట రవీందర్ నాయక్,ప్రియాంక దేవేందర్ నాయక్, గోపి నాయక్, శంకర్ నాయక్, రెడ్యా, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top