PS Telugu News
Epaper

తాగునీటి సమస్య పరిష్కారం కోసం భైంసా పట్టణానికి 28 కోట్ల నిధుల విడుదల

📅 14 Jan 2026 ⏱️ 3:14 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి.

అమృత్ మహోత్సవ్ ద్వారా మహాదేవ్ చెరువు ఆధునికరణకు 2కోట్ల 14 లక్షలు

భైంసా పట్టణం లోని కాలనీల్లో తాగునీటి సమస్య పరిష్కారం కోసం యూ ఐ డి. ఎఫ్. పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిధులు నేషనల్ హోసింగ్ బ్యాంక్ కలిపి 28 కోట్ల రూపాయల నిధులు విడుదలైనట్లు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలియజేశారు.. భైంసా లోని ఎస్. ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా అయన మాట్లాడారు. ఈ నిధులతో పట్టణం లో తాగు నీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు పైప్ లైన్ తో పాటు. ట్యాంక్ ల నిర్మాణం చేపడతామన్నారు.అదే విధంగా అమృత్ మహోత్సవ్ నిధులు 2కోట్ల 14 లక్షల రూపాయల నిధులతో మహాదేవ్ మందిర్ చెరువును ఆధునికరిస్తామన్నారు. చెరువు లో మురికి నీరు రాకుండా ఉంచడం తో పాటు మహాదేవ్ మందిరాన్ని పర్యటక కేంద్రంగా మారుస్తామన్నారు. నిధులు విడుదల చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదములు తెలిపారు.సమావేశం లో మాజీ మున్సిపల్ చైర్మన్ బి. గంగాధర్, బిజెపి పట్టణ అధ్యక్షులు రావుల రాము. సీనియర్ నాయకులు సొలంకి భీంరావ్, సాంవ్లీ రమేష్, వెంగల్ రావ్ నాయకులు దిలీప్, గాలిరాజు,మధు పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top