హలో కామ్రేడ్ ఛలో ఖమ్మం
పయనించె సూరుయుడు జనవరి 14పొనకంటి ఉపేందర్ రావు
టేకులపెల్లి ;సిపిఐ భద్రాద్రి జిల్లా కార్యదర్శి ఎస్.కె సాబీర్ పాషా… టేకులపల్లి మండల సిపిఐ కార్యాలయంలో బుధవారం ఈరోజు మండల కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా పాల్గొని మాట్లాడుతూ ఈనెల జనవరి 18న ఖమ్మంలో జరిగే సిపిఐ శతాబ్ది ఉత్సవాల భారీ బహిరంగ సభకు వేలాదిగా కదిలి రావాలని. ఐదు లక్షల మందితో జరిగే ఈ సభకు మన అందరి కృషి ఉండాలని కోరారు. స్వతంత్ర ఉద్యమం నుండి నేటి వరకు ప్రజల కోసం ఉద్యమించిన ఏకైక పార్టీ సిపిఐ 100 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకోవడం గర్వకారణమని ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభను ఈ ప్రాంతం నుంచి కదిలి రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐమండల కార్యదర్శి గుగులోతు.రాంచందర్ అయిత శ్రీరాములు గుగులోతుశ్రీను లక్ష్మణ్ సోనీ.విజయ లక్ష్మి విజయ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు