PS Telugu News
Epaper

రాష్ట్ర స్థాయి నెట్ బాల్ పోటీలకు పోతంగల్ కలాన్ విద్యార్థులు

📅 14 Jan 2026 ⏱️ 6:26 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు గాంధారి 15/01/26

గాంధారి మండలంలోని పోతంగల్ కలాన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉమ్మడి నిజామాబాదు జిల్లా లోని తిర్మన్ పల్లి లో నిర్వహించిన U/14 బాలబాలికల నెట్ బాల్ సెలెక్షన్స్ లో మంచి ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి పోటీలకు బస్సి మదన్ సింగ్ ,బస్సి రేఖ ,సెలెక్ట్ అయ్యారు అని పోతంగల్ పాఠశాల ఫీజికల్ డైరెక్టర్ నాగరాజు తెలిపారు. ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రంగారావు మాట్లాడుతు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లో జనవరి 16 నుండి 18 వరకు జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొటారు అని తెలిపారు. వీరిని ఉపాధ్యాయ బృందం మరియు గ్రామ సర్పంచ్ అనుశ్రీ బాలరాజు , ఉప సర్పంచ్ సంజీవరెడ్డి, గ్రామస్తులు యువకులు అభినందించారు.

Scroll to Top