ఒకే కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములకు ప్రభుత్వ ఉద్యోగాలు
పయనించే సూర్యుడు గాంధారి 17/01/26
గాంధారి మండలంలోని నౌసిరం తాండకు చెందిన బామన్ సర్దార్ & సోదరాబాయి పుణ్య దంపతులకు చెందిన చిన్న కుమారుడు బామన్ శ్రీకాంత్ కు నిన్న వెలువడిన SSC-GD ఫలితాలలో CISF ఉద్యోగానికి ఎంపిక కావడం జరిగింది. అలాగే వారి పెద్ద కుమారుడు సరిచంద్ పోలీస్ కానిస్టేబుల్ లోనూ , మరో కుమారుడు భవిచాంద్ ఇండియన్ ఆర్మీలో సేవలు అందిస్తున్నారు. విల తల్లి దండ్రులు తండలోనే చాలా నిరుపేద కుటుంబం మరియు వీరు ఎన్నో అవమానాలు ఎదురైనపాటికి కుమారులను మాత్రం ఉన్నత మైన విద్యను అందించారు. ముగ్గురు కుమారులు ఉద్యోగం సాధించడంతో తల్లి దండ్రులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. వీరి విజయం పట్ల గ్రామస్తులు మరియు చుట్టూ పక్క ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.