శ్రీ వీర్లయ్య స్వామి వారి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ
పయనించే సూర్యుడు జనవరి 17 (సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు)
పెళ్లకూరు మండలం, తాలవాయపాడు గ్రామంలో శనివారం నిర్వహించిన శ్రీ వీర్లయ్య స్వామి వారి ఉత్సవాల్లో సూళ్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని, గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన స్వామివారి ఊరేగింపులో ఆమె పాల్గొని భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆ స్వామివారిని వేడుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు
