ప్రభుత్వ వసతి గృహంలో దోమల నివారణ కు మందు పిచికారి
పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 17 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
ప్రభుత్వ ఆదేశాల మేరకు సంక్రాంతి సెలవుల సందర్భంగా అన్ని ప్రభుత్వ వసతి గృహాల్లో దోమల నివారణ చర్యలు చేపడుతున్నారు. జిల్లా మలేరియా అధికారి డి. ఒబుల్ సూచనల మేరకు శనివారం తాడిపత్రి మలేరియా సబ్ యూనిట్ అధికారి చిగురుపాటి శ్రీనివాసులు ఆధ్వర్యంలో రాయల చెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని నీవేములపాడు కస్తూరిబా బాలికల వసతి గృహంలో మాలాథియాన్ డబ్ల్యూడీపీ 25 శాతం మందుతో గదులన్నింటికి స్ప్రే చేయించారు.ఈ కార్యక్రమంలో తాడిపత్రి మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసులు, మేల్ హెల్త్ అసిస్టెంట్ మైనుద్దీన్ పాల్గొన్నారు.
