అలాంటి లింక్స్ ను క్లిక్ చేయొద్దు : సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్
అలాంటి లింక్స్ ను ఓపెన్ చేయవద్దు
జనం న్యూస్ జనవరి 17 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
వాట్సాప్ గ్రూపుల్లో రూ.5 వేలు వస్తాయని లింక్స్ షేర్ చేయమని వస్తున్న మెసేజ్ లను నమ్మవద్దని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ తెలిపారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవద్దని,ఫోన్లు హ్యాక్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపే లింక్ లను తెరవకుండా, ఇతరులకు కూడా పంపకుండా ఉండాలని సూచించారు. ఇలాంటి ఫేక్ లింక్స్ చాలా ప్రమాదకరమని పేర్కొన్నారు.