యానాం కోకో బీచ్‌లో అంబరాన్నంటిన సంక్రాంతి ముగింపు సంబరాలు జనసంద్రమైన తీరం
జనం న్యూస్ జనవరి 17 ముమ్మిడివరం ప్రతినిధి
సురసేనాయానాం ఆంధ్ర గోవా కోకో బీచ్‌లో గత మూడు రోజులుగా జరుగుతున్న సంక్రాంతి సంబరాలు ముగింపు వేడుకలు శుక్రవారం అత్యంత అంగరంగ వైభవంగా జరిగాయి. స్థానిక శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు ప్రత్యేక పర్యవేక్షణలో నిర్వహించిన ఈ ముగింపు వేడుకలకు మునుపెన్నడూ లేని విధంగా లక్షలాదిగా జనం తరలివచ్చారు.ఈ ముగింపు వేడుకలో సినీ సంగీత లోకపు దిగ్గజాలు గీతామాధురి, మోహన భోగరాజు, సాకేత్, అరుణ్ మరియు నెల్లూరు సింగర్స్ తమ గాత్రంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ‘సరిగమప’ ఆర్కెస్ట్రా టీం అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి తన నటనతో, హాస్యంతో నవ్వుల పువ్వులు పూయించారు.అనంతరం ‘ఢీ’ ఫేమ్ డ్యాన్సర్లు తేజస్విని, గోవింద్ మాస్టర్ టీం తమ డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌తో స్టేజ్‌పై మంటలు పుట్టించారు. ఇన్‌స్టాగ్రామ్ ఫేమ్ వెరోనికా రాకతో యువతలో ఉత్సాహం రెట్టింపయ్యింది. ఆకాశంలో అద్భుతమైన బాణాసంచా ప్రదర్శన జరిగింది. రంగురంగుల వెలుగులతో కోకో బీచ్ ఆకాశం కొత్త శోభను సంతరించుకుంది. ఈ బాణాసంచా వెలుగులు పర్యాటకులను, స్థానికులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ.. నా నియోజకవర్గం ఉభయ రాష్ట్రాల లో ఉన్న ఆడపడుచుల మానసిక ఉల్లాసం కోసం ఈ సంబరాలను ప్రారంభించానని తెలుగు సంస్కృతిని కాపాడుతూ, పర్యాటకాన్ని ప్రోత్సహించడమే ఈ వేడుకల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. సంక్రాంతి సంబరాలు ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు