కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగేష్ రెడ్డి విలేకరుల సమావేశం
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ తాటికొండ గంగాధర్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఫిబ్రవరి నెలలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగిందని, అందులో భాగంగానే రాష్ట్రంలోని సుమారు 116 మున్సిపాలిటీలకు, ఏడు నగర కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, మన నిజామాబాద్ జిల్లాలో మూడు మున్సిపాలిటీలు ఒక నిజామాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరగడం జరుగుతుందని, దీనికి సంబంధించి బోధన్ మున్సిపాలిటీకి జనరల్, నిజామాబాద్ మున్సిపాలిటీకి మహిళా జనరల్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీలకు మహిళా జనరల్ రావడం జరిగిందని, వీటిని మొన్ననే అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా యంత్రాంగం సమక్షంలో రిజర్వేషన్ ప్రక్రియను డ్రా ద్వారా అందరికీ వివరించడం జరిగిందని, బోధన్ మున్సిపాలిటీలో 38 వార్డులు, నిజామాబాద్ లో 60 డివిజన్ లు, ఆర్మూర్ లో 36 వార్డులు, భీంగల్ లో 12 వార్డులు ఉన్నాయని, ఏక్కడ ఏ రిజర్వేషన్ ఉందో అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆశవాహులు తమ పట్టణాల అధ్యక్షులకు దరఖాస్తులు ఇవ్వాలని, ఇప్పటికే నిజామాబాద్, భీంగల్ , ఆర్మూర్ పట్టణాలలో దరఖాస్తుల ఆహ్వానం మొదలైంది అని, కావున వెంటనే ఆశవాహులు తమ దరఖాస్తులను అధ్యక్షులకు సమర్పించాలని నగేష్ రెడ్డి తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో 70% సర్పంచులు కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడం జరిగిందని, అందులో భాగంగానే నిజామాబాద్ లో 545 స్థానాలలో 360 స్థానాలు కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడం జరిగిందని, దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ ముందు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకు అమలు చేస్తున్న విషయాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్లడం జరిగిందని, అందులో 80 శాతం వాగ్దానాలు నెరవేర్చడం జరిగిందని, గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో మహిళలకు 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ అందించడం జరుగుతుందని, రేషన్ కార్డు ఉన్నవారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం జరుగుతుందని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందించడం జరుగుతుంది అని, పేద ప్రజల కోసం రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందని, గతంలో రేషన్ కార్డులు ఉన్నవారికి దొడ్డు బియ్యం ఇస్తే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత భారమైన భరించి సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది అని నగేష్ రెడ్డి అన్నారు . తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి లాగింది అని, 14 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పులోకి టీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కెళ్ళింది అని, వచ్చిన ఆదాయం అప్పులకు వడ్డీలకు సరిపోవడం లేదు అని నగేష్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గానికి పేద ప్రజలకు 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుంది అని, గతంలో టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దళిత బంధు పేరుతో 10 లక్షలు ఇస్తూ గ్రామీణ ప్రాంతాల్లో అక్కడక్కడ ఇస్తూ అందులో 50% నిధులు ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ అనుచరులు జేబులోకి వెళ్లడం జరిగిందని, ట్రాక్టర్లు ఇస్తూనే కేవలం టిఆర్ఎస్ కార్యకర్తలకు అందిస్తూ ఒక్కొక్క ట్రాక్టర్ మీద రెండు లక్షల వరకు తీసుకొని బోగస్ ట్రాక్టర్లు ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా దుయ్యబట్టారు. టిఆర్ఎస్ చేసిన మోసాలను ప్రజలు గమనించడం జరిగింది కాబట్టి టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి 64 ఎమ్మెల్యే సీట్లతో గెలిపించడం జరిగిందని, అందులో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో నాలుగు స్థానాలను బోధన్ లో సుదర్శన్ రెడ్డి ని ,రూరల్ లో భూపతి రెడ్డి ని గెలిపించడం జరిగింది అని ఆయన అన్నారు. బోధన్ నియోజకవర్గంలో గత ఎమ్మెల్యే షకీల్ స్కీములపై కమిషన్లు తీసుకుంటూనే బోగస్ రైస్ మిల్లు పెట్టి 200 కోట్ల వరకు దోచుకోవడం జరిగిందని, అధికారులను భయపెట్టించి తమ జేబులు నింపుకున్నారని కొందరు అధికారులు గత ఎమ్మెల్యే వల్ల సస్పెండ్ కావడం జరిగిందని ఆయన అన్నారు. బోధన్ పట్టణానికి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఏనలేని అభివృద్ధి చేయడం జరిగిందని, మంత్రితో సమానంగా సుదర్శన్ రెడ్డి కి సలహాదారు పదవి ఉంది అని, కావున బోధన్ పట్టణం కాంగ్రెస్ ప్రభుత్వం కైవసం చేసుకుంటుంది అని ఆయన అన్నారు. బోధన్ లో 104 స్థానాలకు గ్రామ పంచాయతీ 85 స్థానాలు కాంగ్రెస్ ప్రభుత్వం గెలుచుకుంది అని, మున్సిపాలిటీ ఎన్నికల్లో 38 స్థానాలకు 36 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది అని నగేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని కాకుండా బిజెపి అభ్యర్థిని గెలిపించుకున్నందుకు ప్రజలు బాధపడుతున్నారని గెలిచిన బిజెపి ఎమ్మెల్యే మా ప్రభుత్వం లేదు ఏమి చేయలేమాని చెప్తున్నాడని దానిని గ్రహించిన ఆర్మూర్ ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను 36 స్థానాలలో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గత టీఆర్ఎస్ సమయంలో అడ్డగోలుగా వ్యాపారాలలో సంపదించూకొని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఆ డబ్బులు విచ్చలవిడిగా పంచిపెట్టి గెలవాలని ప్రయత్నం చేస్తున్నాడని ప్రజలు రెండు సంవత్సరాలలో ప్రశాంత్ రెడ్డి చేసిన అభివృద్ధిని చూసి ఆయనపై విమర్శలకు సిద్ధంగా ఉన్నారని భీమ్గల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 12 స్థానాల్లో గెలవడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. అదేవిధంగా నిజమాబాద్ పట్టణంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డి శ్రీనివాస్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప గతంలో బిజెపి ఎమ్మెల్యే ఉన్నప్పుడు గానీ, 10సం బిఆర్ఎస్ ఎమ్మెల్యే వున్నపుడు గానీ, ఇప్పుడు సూర్యనారాయణ రెండు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా జరిగిన అభివృద్ధి ఏమీ లేదు అని, గత మున్సిపల్ ఎన్నికల్లో బైంసా అల్లర్లను అరవింద్ అడ్డుపెట్టుకొని మున్సిపల్ ఎన్నికల్లో 28 స్థానాలు గెలిపించుకోవడం జరిగిందని, కానీ ఏ డివిజన్లో కూడా అభివృద్ధి జరిగినా పరిస్థితి లేదు అని, గెలిచిన తర్వాత బిజెపి కార్పొరేటర్లు డివిజన్లో కనిపించిన పాపాన కూడా పోలేదని , మళ్లీ బిజెపి నాయకులు నిజామాబాదులో గెలుస్తామని చెప్పుకుంటున్నారని అది వారికి కల గానే మిగిలిపోతుంది అని నగేష్ రెడ్డి అన్నారు. గతంలో సుదర్శన్ రెడ్డి నాయకత్వంలో అలీసాగర్ డ్యామ్ కెపాసిటీ పెంచి నిజామాబాద్ నగరంలో ఇంటింటికి నీరు వచ్చే విధంగా మంచినీటి సరఫరా చేయడం జరిగిందని, గత ఎమ్మెల్యే దానికి పాలాభిషేకం చేసి తాను చేశాను అని చెప్పుకోవడం జరిగిందని, కానీ దానిని సుదర్శన్ రెడ్డి నాయకత్వంలో తీసుకురావడం జరిగిందని, అదేవిధంగా పట్టణంలో ఉన్న మెడికల్ కాలేజీని సుదర్శన్ రెడ్డి తీసుకురావడం జరిగిందని, నిజామాబాద్ లో జరిగిన అభివృద్ధి మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగింది తప్ప బిజెపి చేసింది ఏమీ లేదు అని, అరవింద్ మోడీ అమిత్ షా దగ్గర ఆయన దగ్గర సంబంధాలు ఉన్నాయని చెప్తూనే నిజాంబాద్ పార్లమెంటుకు కేంద్రం నుండి నిధులు తీసుకువచ్చిన పాపాన పోలేదని ,బిజెపి అధికారంలోకి రాకముందు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు అని, నల్లధనాన్ని బయటకు తీసి పేదవాని ఎకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తానని చెప్పి ఎక్కడ కూడా ధనికులపై చర్యలు తీసుకోలేదని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ వ్యవస్థలకు మద్దతు తెలుపుతుంది అని నగేష్ రెడ్డి దుయ్యబట్టారు. బిజెపి ఎల్లప్పుడు మతం పైన టిఆర్ఎస్ ఎల్లప్పుడు ప్రాంతం పైన మాత్రమే మాట్లాడుతారని, బిజెపి నిజామాబాద్ నగరంలో నిజామాబాద్ పేరును ఇందూరు గా మారుస్తామని ముందుకు వెళుతున్నారని పేరు మారిస్తే కాదు కేంద్రం నుండి నిధులు తీసుకువస్తే ప్రజల జీవితాలు మారుతాయని నగేష్ రెడ్డి హితవు పలిచారు. బిజెపి నాయకులకు ఎన్నికలు రాగానే మతం గుర్తుకు వస్తుందని కాంగ్రెస్ నాయకులు కూడా రాముని పూజిస్తారని బిజెపి నాయకులు మతాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని, డిచ్పల్లి రామాలయాన్ని కాంగ్రెస్ అభివృద్ధి చేసిందని, ఖిల్లా రామాలయాన్ని కాంగ్రెస్ అభివృద్ధి చేసిందని, సుభాష్ నగర్ రామాలయాన్ని అక్కడ ఉన్న కాంగ్రెస్ సభ్యులు అభివృద్ధి చేశారని, అన్ని ఆలయాలను కాంగ్రెస్ ప్రభుత్వం మీ అభివృద్ధి చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మతాలకు సంబంధించిందని ఈ దేశాభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ లక్ష్యమని గతంలో టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు క్యాబినెట్లో కేవలం ఉన్నత వర్గాలకే ప్రాధాన్యత ఇచ్చారని రెండోసారి టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకరు ఇద్దరు మహిళలకు క్యాబినెట్లో అవకాశం ఇవ్వడం జరిగిందని, అది కూడా కేవలం నామ మాత్రం అధికారం మాత్రమే ఇవ్వడం జరిగిందని నగేష్ రెడ్డి అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు దళిత ముఖ్యమంత్రి చేస్తానని ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని ప్రతి పేదవానికి ఇందిరమ్మ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని మోసం చేయడం జరిగిందని అన్నారు బిజెపి చేస్తున్న మత రాజకీయాలను ప్రజలు నమ్మవద్దు అని ఇందూరు అనేది గతంలో ఉన్న పాత పేరు అని దానిని ఎవరు మార్చారు ఎవరికీ తెలియదని పేరు మారిస్తే ప్రజా జీవితాలలో మార్పు రాదు అని బైపాస్ లో ఉన్న ఫ్లైఓవర్లలో ఏది కూడా అరవింద్ అభివృద్ధి చేయడం లేదు అని కేంద్రం నుండి నిధులు రావడం లేదు అని రాష్ట్రంలో ప్రభుత్వానికి సూచనలు అరవిందు ఇవ్వాలని కానీ ఎల్లప్పుడూ మతంపై మాట్లాడుతూ ప్రజలపై చిచ్చు పెట్టద్దని నగేష్ రెడ్డి హితవు పలికార. నిజామాబాద్ లో కాంగ్రెస్ కార్పొరేటర్లు గెలిస్తే మహేష్ కుమార్ గౌడ్ షబ్బీర్ అలీ సుదర్శన్ రెడ్డి నాయకత్వంలో నిజామాబాద్ నగరాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకు వెళ్దామని, మిగిలిన మూడు మున్సిపాలిటీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కైవసం చేసుకుంటుంది అని నగేష్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ కేశ వేణు , గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజారెడ్డి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ,మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతిరాష్ట్ర ప్రచార కమిటీ మెంబెర్ జావీద్ అక్రం ఏఐసీసీ కో ఆర్డినేటర్ ఘన్ రాజ్ , ఎస్టి సెల్ జిల్లా అధ్యక్షులు యాదగిరి , బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు రాజా నరేందర్ గౌడ్ , సేవాదళ్ జిల్లా అధ్యక్షులు సంతోష్ , సెల్ జిల్లా అధ్యక్షులు లింగం , జిల్లా ఫిషరీస్ చైర్మన్ శ్రీనివాస్ ఎన్ ఎస్ యు ఐ, రాష్ట్ర కార్యదర్శి వేణు రాజు వినయ్ , సుమన్ , ఏజాజ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
