వందేళ్ళ కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 20న ఇల్లెందులో జరిగే భారీ బహిరంగ సభ ను జయప్రదం చేయండి
సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ
పయనించె సూర్యుడు జనవరి 19పొనకంటి ఉపేందర్ రావు
టేకులపల్లి :భారత కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాల ఆవిర్భావం సందర్భంగా ఇల్లందులో ప్రదర్శన ఐతా ఫంక్షన్ హాల్ లో జరిగే సభను జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఇల్లందు డివిజన్ నాయకులు నోముల. భానుచందర్ పిలుపునిచ్చారు. వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమంలో ఎంతోమంది తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించారని ఎన్నో ఉద్యమాలను నిర్మించిందని కూడు గూడు నీడ కోసం ఎన్నో ఉద్యమాలు చేసి సాధించి పెట్టిందని తెల్ల బట్టల వాళ్ళను చూస్తే భయపడ్డా ఆదివాసీలను చైతన్యవంతం చేసి ఫారెస్టు భూస్వాములను వ్యతిరేకించి లక్షలాది ఎకరాల భూమిని పంచిపెట్టిన చరిత్ర ఎర్రజెండాకు ఉందని ఆయన అన్నారు. అట్టి భూములకు పట్టాలు సాధించిపెట్టిందని ఎన్నో గ్రామాలకు విద్యాలయాలు నిర్మించిందని వైద్యం రవాణా రోడ్లు నిర్మించిందని వారు గుర్తు చేశారు. ఉన్నత చదువులు చదివి ఉన్నత కుటుంబాలలో జన్మించి ఉన్నతమైన ఉద్యోగాలని వదిలేసి ఈ ఉద్యమంలో పేద ప్రజల కోసం నూతన ప్రజాస్వామ్య విప్లవం కోసం ఎన్నో పోరాటాలు చేశారని ఆయన అన్నారు. నిజాం నవాబు కు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం శ్రీకాకుళం గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాలు నిర్మించిందని కూలిరేట్లను పెంచిందని కార్మికులను ఐక్యం చేసి కార్మిక హక్కులను కాపాడడంలో ప్రధాన పాత్ర పోషించిందని వారు అన్నారు. ప్రధానంగా ఏజెన్సీలో ఆదివాసి చట్టాలను అమలు చేయించడంలో తమ వంతు పాత్రను తమ ప్రాణాలను లెక్కచేయకుండా అమలు చేయించగలిగారని అది ఒక ఎర్రజెండాకే సాధ్యమని వారు అన్నారు. ఎన్నో ఏండ్లుగా వెనుకబడిన తెలంగాణను సాధించడంలో విఫలమైన బూర్జువా పార్టీలను పక్కనపెట్టి ఎర్రజెండా ఎత్తుగడతో తెలంగాణను సాధించడంలో తన వంతు ప్రధాన పాత్ర పోషించిందని అదే విధం గా నిరుద్యోగ, కార్మికుల సమస్యలు పరిష్కరించిందని వారు అన్నారు.భారత దేశంలో ఎర్రజెండా పాత్ర మరువలేనిది. భారత ఉద్యమంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఇప్పటివరకు పేద ప్రజల పక్షాన నిలబడి పోరాడి సాధిస్తూనే ఉందని అలాంటి ఉద్యమాలను నెమరు వేసుకుంటూ భవిష్యత్తు కర్తవ్యాలను నిర్మించడం కోసం ప్రజా ఉద్యమాలను ఎలా నిర్మించాలో అంచనా వేసుకోవడం కోసం జనవరి 20 న ఇల్లెందులో జరిగే సభకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సభకు ముఖ్య భక్తులుగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వేములపల్లి వెంకటరామయ్య, ఆవునూరి మధు, జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జె సీతారామయ్య, ఇల్లెందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు పాల్గొని ప్రసంగిస్తారని వారు తెలియజేశారు.
ఎండ్ న్యూస్