PS Telugu News
Epaper

కేటీఆర్ సేన నియోజకవర్గ ఇన్‌చార్జిగా మహేష్ మాల నియామకం,

📅 19 Jan 2026 ⏱️ 7:33 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

యువత శక్తితో పార్టీ బలోపేతమే లక్ష్యం,

నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించిన

కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మోంగని మనోహర్ కి కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్ సేన ఇంచార్జి మహేష్ మాల,

( పయనించే సూర్యుడు జనవరి 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)

తెలంగాణ రాష్ట్ర రాజకీయ వేదికపై కేటీఆర్ సేన విస్తరణలో కీలక అడుగు కేటీఆర్ సేన నియోజకవర్గ ఇన్‌చార్జిగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీ కి చెందిన మహేష్ మాల ను నియమించారు ఈ నియామకం నియోజకవర్గ వ్యాప్తంగా యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపింది కేటీఆర్ సేన వ్యవస్థాపకులు పార్టీ పెద్దల సూచనల మేరకు ఈ నియామకం జరిగిందని గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ యువతను సంఘటితం చేయడంలో మహేష్ మాల కీలక పాత్ర పోషించారు ఈ సందర్భంగా మహేష్ మాల మాట్లాడుతూ కేటీఆర్ ఆశయాలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లడమే నా ప్రధాన లక్ష్యం యువతను రాజకీయంగా చైతన్యవంతులను చేసి పార్టీ బలోపేతానికి అంకితభావంతో పని చేస్తాను అని అన్నారు నియోజకవర్గంలోని పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ నియామకాన్ని హర్షిస్తూ మహేష్ మాల నాయకత్వంలో కేటీఆర్ సేన మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు,

Scroll to Top