ఖమ్మంలో పి.డి.ఎస్.యు.తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభలు
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ తాటికొండ గంగాధర్
-రాష్ట్ర 23వ మహాసభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ఉన్న సాయి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ లో ఈనెల 23 24 25న పి డి ఎస్ యు రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లు ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షుడు ఎం నరేందర్ మాట్లాడుతూ 79 ఏండ్ల స్వాతంత్ర్య పాలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద, మధ్యతరగతి వర్గాలకు ఉచితంగా నాణ్యమైన సమాన విద్యను అందించడంలో పూర్తిగా విఫలమైనారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని ప్రైవేట్ ,కార్పొరేట్ యాజమాన్యాలకు అప్పగించి విద్యా వ్యవస్థను పూర్తిగా వ్యాపారమయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు విద్యారంగా అభివృద్ధిని, విద్యార్థుల సంక్షేమాన్ని, విశ్వవిద్యాలయాల పరిరక్షణను పూర్తిగా విస్మరిస్తున్నరని ఆవేదన వ్యక్తంచేశారు. విద్య రంగాన్ని కాషాయికరించి, విద్యార్థుల మెదల్ల లో కుల, మత విష బీజాలు నాటుతూ దేశంలో మతోన్మాద ఫాసిజన్ని పెంచి పోషిస్తున్న మోడీ-ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ ల కుట్రపూరిత విధానాలను నేటి విద్యార్థులు ప్రతిఘటించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు.1972 లో ఉస్మానియా యూనివర్సిటీలో కామ్రేడ్ జార్జి రెడ్డి ప్రేరణతో ఆవిర్భావించిన పి.డి.ఎస్.యు. నాటి నుండి నేటి వరకు ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం, విద్యార్థుల హక్కుల కోసం, శాస్త్రీయ విద్య, సమానత్వ సమాజ స్థాపన కోసం అలుపెరుగని పోరాటాలు నిర్వహించిందని గుర్తు చేశారు. ఈ క్రమంలో ఎందరో విద్యార్థులు లాఠీలు, తూటాలు, అక్రమ నిర్బంధాలు, జైలు జీవీతాలు, రాజ్యహింసను ఎదుర్కోన్నారని, కామ్రేడ్ జార్జి రెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, శ్రీ పాద శ్రీహరి, కోలా శంకర్, దుస్సా చేరాలు, బొమ్మ సాంబయ్య, రంగవల్లి, మారోజు వీరన్న, మధుసూదన్ రాజ్, వరహాలు, రమణయ్య లాంటి విప్లవ విద్యార్థి వీరులు తమ రక్తం ధారపోసి అమూల్యమైన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని తెలిపారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను చర్చించి,గత కార్యక్రమాలను సమీక్షించుకొని, భవిష్యత్ఉద్యమ కార్యాచరణను రూపొందించుకోవడంలో భాగంగా రాష్ట్ర 23వ మహాసభలు జరుపుతున్నామన్నారు. ఖమ్మంలో జరిగే పి.డి.ఎస్.యు. 23వ రాష్ట్ర మహాసభలకు విద్యార్థి లోకం అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు ఆర్మూర్ ఏరియా అధ్యక్ష కార్యదర్శులు నిఖిల్ రాజు , ఏరియా నాయకులు కైఫ్ , వినయ్ , సాయికిరణ్ గౌడ్ , ప్రణయ్ , విష్ణువర్ధ , తదితరులు పాల్గొన్నారు.