శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం
పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 20 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
యాడికి శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి స్వస్తిశ్రీ విశ్వవసు నామ సంవత్సర మాధ శుద్ధ విదియ 20-1- 26 మంగళవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మ దినోత్సవ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం ఏడు గంటల 30 నిమిషాలకు గణపతి పూజ నవగ్రహ పూజ శివపార్వతులకు మరియు వాసవి కనకా పరమేశ్వరి అమ్మవారికి పంచామృతాభిషేకము కుంకుమార్చన లలితా సహస్రనామ పారాయణము 11 గంటలకు అమ్మవారి గుండ ప్రవేశము పూర్ణాహుతి మహా మంగళహారతి కార్యక్రమాలు నిర్వహించి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు అలాగే ఉదయం నుండి అల్పాహారము మధ్యాహ్నము అన్న ప్రసాదము వితరణ చేయడం జరిగింది ఆలయ ప్రాంతమంతా జై వాసవి మాత జై జై వాసవి మాత అంటూ నినాదాలతో మార్మోగింది ఈ కార్యక్రమం అంతా యాడికి ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు
