నియోజకవర్గ అభివృద్ధికి నిత్య శ్రామికుడిగా బండారు సేవలు
ఎమ్మెల్యే సత్యానందరావును అభినందించిన పాలూరి సత్యానందం.
పయ నించే సూర్యుడు జనవరి 21 ముమ్మిడివరం ప్రతినిధి-
నిత్య శ్రామికుడిగా, ప్రజాసేవే పరమావధిగా శాశ్వత పరిష్కారాల లక్ష్యంగా పనిచేస్తున్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం అభినందించారు. రాష్ట్రంలోనే నెంబర్ వన్ సంక్రాంతి సంబరాలు నిర్వ హించడమే కాకుండా, అనతి కాలంలో నియో జకవర్గంలో రూ.150 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టడం ఆయన పనితీరుకు నిదర్శ నమని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచినప్పటికీ పరిపాలన ప్రజారంజకంగా సాగుతోందని, కొత్తపేట నియోజకవర్గంలో అభివృద్ధి పరిగెడుతోందని పాలూరి తెలిపారు. వాడపల్లి దేవాలయ అభి వృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు పలు దేవాలయాలకు నిధులు సమకూర్చారని, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 770 మం దికి రూ.5 కోట్ల 50 లక్షల చెక్కులు అందిం చగలిగారని ప్రశంసించారు. వాడపల్లి దేవాల యానికి వెళ్లే ఏటిగట్టు రోడ్డు నిర్మాణానికి పవన్ కళ్యాణ్‌ను కలిసి రూ.7 కోట్ల నిధులు తెచ్చి పనులు ప్రారంభించారని, కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు మెరుగుపరచి ఖాళీగా ఉన్న పోస్టుల్లో డాక్టర్లను నియమించారని చెప్పారు. అలాగే ఆర్డీవో, డీఎస్పీ కార్యాలయాలకు శాశ్వత భవనాలు, లొల్ల లాకుల ఆధునికీకరణకు టూరిజం అభి వృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయడంలో ఎమ్మెల్యే కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. శాశ్వత పరిష్కారాలే లక్ష్యంగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్న బండారు సత్యానందరావు పనితీ రుపై నియోజకవర్గ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారని పాలూరి సత్యానందం అన్నారు.