భైంసా పట్టణంలో శ్రీ మార్కండేయ మహర్షి జయంతిఘనంగా నిర్వహించారు.
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి.
భైంసా పట్టణంలోని శ్రీ మార్కండేయ జయంతిని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అతిథిగా హాజరై వేడుకల్లో పాల్గొన్నారు.ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ మార్కండేయ స్వామిని దర్శించుకుని నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, శ్రీ మార్కండేయ మహర్షి జీవితం, ఆయన బోధనలు సమాజానికి ఆదర్శప్రాయమని తెలిపారు. యువత ఆయన మార్గాన్ని అనుసరించి సన్మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హనుమాన్లు,ప్రకాష్, సోమేష్ ,సాయినాథ్, ధర్మపురి ,గణేష్, ముత్తన్న, తదితరులు పాల్గొన్నారు.
