PS Telugu News
Epaper

రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్

📅 22 Jan 2026 ⏱️ 5:16 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు జనవరి 22 నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న

నంద్యాల జిల్లా సిరివెళ్ల మెట్ట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం ఆయన ప్రమాద స్థలాన్ని స్వయంగా సందర్శించి, పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం జరిగిన తీరును మంత్రి ఫరూక్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదం అత్యంత హృదయ విదారకమని, ప్రాణనష్టం జరగడం తనను ఎంతో కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద సమయంలో ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు సాహసోపేతంగా వ్యవహరించిన బస్సు క్లీనర్‌ను ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ ప్రత్యేకంగా అభినందించారు.ఈ ప్రమాదంలో మృతి చెందిన బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్ మరియు లారీ క్లీనర్ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించడమైనది అని. బాధితులకు ప్రభుత్వం తరఫున పూర్తి చికిత్స అందుతుందని భరోసా ఇచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరపాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి ఫరూక్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Scroll to Top