మన ఎమ్మెల్యే విజయ్ శ్రీ నారా లోకేష్ జన్మదిన వేడుక జరపబోతున్నారు
పయనించే సూర్యుడు జనవరి 22 (సూళ్లూరుపేట నియోజకవర్గం దాసు)
సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ఎప్పటినుంచో ఎమ్మెల్యే విజయ్ శ్రీ పేద ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడైన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని సూళ్లూరుపేట ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమం చేయాలని జనవరి 23 వ తారీఖున ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు ఆ కార్యక్రమాలను మీడియా ద్వారా ప్రజలకు తెలియపరుస్తున్నారు శాసన సభ్యురాలు డాక్టర్ నెలవలే విజయ్ శ్రీ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ జనవరి 23 వ .తారీఖున ఉదయం 10 గంటలకు సూళ్లూరుపేట షార్ ఫ్లైఓవర్ సమీపంలో సత్య సాయి కళ్యాణ మండపం నందు మెడికల్ క్యాంప్ ప్రారంభోత్సవం. ఉదయం 10:30 కు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద రక్తదాన శిబిరం మరియు జన్మదిన వేడుకలు . ఉదయం 11 గంటల 30 నిమిషాలకు గాంధీ విగ్రహం సర్కిల్ వద్ద అన్నదాన కార్యక్రమం. కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సేవా కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా సూళ్లూరుపేట శాసనసభరాలు డాక్టర్ నెలవల విజయ్ శ్రీ సూళ్లూరుపేట ప్రజలను కోరుచున్నారు