PS Telugu News
Epaper

అయోధ్య ఆలయ వార్షికోత్సవం సందర్భంగా మహా పాదయాత్ర.

📅 22 Jan 2026 ⏱️ 5:23 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు జనవరి 22 ముమ్మిడివరం ప్రతినిధి

కాట్రేనికోన మండలం కందికుప్ప రామాలయం నుండి ఈరోజు ఉదయం అగ్నికుల క్షత్రియ గ్రామాల నుండి ఉప్పూడి గ్రామంలో వేంచేసియున్న శ్రీ అభయాంజనేయ స్వామివారి విగ్రహం వరకు ఓలేటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర మాతృమూర్తులు గ్రామస్థులు రామభక్తులు భజన బృందాల వారు కోలాటం బృందం వారు ఇలా అనేకమంది ఈ పాదయాత్రలో పాల్గొని హరినామ సంకీర్తన గావిస్తూ శ్రీరాముని రధము వెంట నడిచినారు. ఈ కార్యక్రమాన్ని ముందుగా ముమ్మిడివరం మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు గోలకోటి వెంకటరెడ్డి మల్లాడి రాధాకృష్ణ కోలా మీరయ్య లు కొబ్బరికాయ కొట్టి పాదయాత్రను ప్రారంభించినారు రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ సనాతన ధర్మాన్ని రక్షించుకొనుటకు ప్రతి ఒక్కరికి రామ తత్వం తెలియడం కోసం ప్రతి హిందువు ఈ ధర్మ ఆచరణలో ఉండాలని తెలియజేయడం కోసమే ఈ మహా పాదయాత్రను మూడు సంవత్సరముల నుండి నిర్వహిస్తున్నామని తెలియజేశారు. గొలకోటి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు తరచూ జరగడం వలన ప్రజలలో చైతన్యం కలిగి ధర్మాచరణలో ముందుంటారన్నారు. సమరసత సేవా ఫౌండేషన్ ముమ్మిడివరం ఖండ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు యువత రామాయణం భాగవత పురాణ గాథలను తెలుసుకుంటూ శ్రీరాముని ఆదర్శంగా తీసుకొని జీవించాలన్నారు. ఆధ్యాత్మిక ప్రవచకులు బి లక్ష్మీనారాయణ దేశం కోసం ధర్మం కోసం యువత ముందుండాలన్నారు. మాతృమూర్తులు తమ బిడ్డలకు చత్రపతి శివాజీ స్వామి వివేకానంద చరిత్రలను తెలియజేస్తూ వారిలో స్ఫూర్తిని కలగజేయాలని గ్రంధి నానాజీ అన్నారు. స్వామి వివేకానంద వేషధారణలో చేక్కా అజయ్ వర్మ మరియు శ్రీ సీతా రామ లక్ష్మణులు వేషధారణలో మల్లాడి రాధాకృష్ణ బృందం ప్రత్యేక ఆకర్షణగా ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో కోలా మీరయ్య కేతా భార్గవ్ సత్య రెడ్డి మాతృమూర్తులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Scroll to Top