సమ్మక్క సారక్క జాతరకు ఎమ్మెల్యే కు ఘనస్వాగతం పలికిన గ్రామ ప్రజలు
పయనించే సూర్యుడు జనవరి 23 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
పడమట నరసాపురంలో నిర్వహించిన రెండో రోజు సమ్మక్క సారక్క జాతరకు పడమట నరసాపురం గ్రామ సర్పంచ్ సంగం లక్ష్మీ కుమారి, మరియు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ కమిటీ చైర్మన్ లేళ్ళ అప్పిరెడ్డి గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్,ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు లేళ్ళ వెంకటరెడ్డి కీ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సమ్మక్క సారక్క జాతర వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసి భక్తులకు సౌకర్యాలు కల్పించారు జాతరకు వచ్చిన భక్తులను సాదరంగా ఆహ్వానిస్తూ సాంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించారు గ్రామ అభివృద్ధి తో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తామని గ్రామ సర్పంచ్ సంఘం లక్ష్మి కుమారి , ఆలయ చైర్మన్ లేళ్ళ అప్పిరెడ్డి, గ్రామ ఎక్స్ సర్పంచ్ కట్రం మోహన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
