PS Telugu News
Epaper

“”ప్రపంచం మెచ్చిన మేధావి డా,, బి ఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిద్దాం.””

📅 23 Jan 2026 ⏱️ 5:33 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు జనవరి 23,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న

ప్రజా సంఘాల ఐక్యవేదిక

కోవెలకుంట్ల పట్టణంలో స్థానిక జమ్మలమడుగు సర్కిల్ నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గత ఏడాది జనవరి 23న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించడం జరిగింది. సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా విగ్రహ ఆవిష్కరణకు సహకరించిన పెద్దలు జి సూర్యనారాయణ రెడ్డి , పేరా శ్రీధర్ రెడ్డి , మెట్ల రమేష్ , బత్తుల ఓబులేసు , దేవి జ్యువెలర్స్ బ్రదర్స్ నాగరాజు , రంగమ్మ ,వెంకటయ్య , రాములమ్మ కి, ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు ఎం సుధాకర్, వడ్డే సుబ్బరాయుడు, బందెల ఓబులేసు, నవీన్, దండు రామసుబ్బయ్య, అప్ప పోగుల వెంకటసుబ్బయ్య , అందనం దేవరాజు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత ,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బిఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఇప్పటికీ ఆయన రచించిన రాజ్యాంగం అమలులో ఉండటం గర్వించదగ్గ విషయమని వారు ఆయనను కొనియాడారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని రాజ్యాంగం ఒక్క భారతదేశంలో ఉందని ప్రపంచమే మెచ్చుకున్న నాయకునిగా, రాజ నీతిజ్ఞుడుగా ఆయనను స్మరించుకుంటున్నారని గుర్తు చేశారు. ఆయన అడుగుజాడల్లో అందరూ నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు రెడ్డిపల్లి ఓబయ్య, మహేష్, సుబ్బారెడ్డి, గుర్రప్ప,శేషు,కిరణ్ ,నరేష్ , కోయిల దేవరాజు, నాగయ్య, రఘు, మురళి, రవి,మరియు ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Scroll to Top