PS Telugu News
Epaper

కాట్రేనికోన వయా అయినాపురం ముమ్మిడివరం రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన దాట్ల బుచ్చిబాబు

📅 23 Jan 2026 ⏱️ 5:45 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు జనవరి 23 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా

ముమ్మిడివరం కాట్రేనికోన( వయా) అయినాపురం బీటీ రోడ్డు 7 కోట్ల 59 లక్షల గ్రాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు ఎన్నో ఏళ్లుగా మరమ్మత్తులకు నోచుకోని కీలక రహదారికి ఇక శాశ్వత పరిష్కారం దిశగా అడుగు పడింది ముమ్మడివరం నుంచి (వయా ) అయినాపురం వరకు నిర్మించనున్న భిటి రోడ్డు నిర్మాణం. అలాగే 39 లక్షల గ్రాంట్ హెల్త్ సెంటర్ శంకుస్థాపన కార్యక్రమం, అయినాపురంలో 6 సీసీ రోడ్ల కు 62.14 లక్షల ఎన్ ఆర్ జి ఎస్ గ్రాండ్ శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. ముమ్మిడివరం నుండి అయినాపురం( వయా ) రోడ్డు నిర్మాణ అవసరాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి సంబంధిత శాఖ మంత్రిని పలుమార్లు కలిసి అవసరమైన 7.59 లక్షలు నిధులు సాధించి ఈ రోడ్డు పనులను ప్రారంభించే స్థాయికి తీసుకువచ్చారు బుచ్చిబాబు ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే రెండు మండలాల్లోని అనేక వేల మంది ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయం అందుబాటులోకి వస్తుంది ప్రయాణం సమయం తగ్గి వ్యాపారం వ్యవసాయం విద్య తదితర రంగాలకు మరింత ఊపునిస్తోంది ప్రజల కష్టాలను తెలుసుకొని వాటికి పరిష్కారం చూపే నాయకత్వానికి ఇదే నిదర్శనం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న దాట్ల బుచ్చి బాబు వారికి అయినా పురం ప్రజలు, నియోజకవర్గ ప్రజలు హృదయపూర్వక అభినందన తెలిపినారు. అయినాపురంలో లోకేష్ వారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు.ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద, మాజీ మార్కెటింగ్ చైర్ పర్సన్ ఓగూరి భాగ్యలక్ష్మి, చెల్లి అశోక్, తాడి నరసింహ రావు, గొలకోటి దొరబాబు, పొద్దోకు నారాయణరావు, అర్ధాన్ని శ్రీనివాసరావు, చిక్కాల అంజిబాబు,సాగిరాజు సూరిబాబు రాజు, కాకర్లపూడి రాజేష్, విమ్మితి చిరంజీవి,నడింపల్లి సుబ్బరాజు, గుద్దటి జమ్మి, యాళ్ల ఉదయ్, మట్ట సత్తిబాబు, బొంతు నాగరాజు, సత్తి నూకరాజు, అడబాల సతీష్ కుమార్, కుంచనపల్లి నారాయణరావు, కుంచె శ్రీను, దాట్ల బాబు, డేవిడ్ రాజ్, బద్రి రమాదేవి, నడిమింటి సూర్య ప్రభాకర్ రావు, గొల్లపల్లి గోపి, మొదలగువారు పాల్గొన్నారు.

Scroll to Top