PS Telugu News
Epaper

వాడపాలెంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

📅 23 Jan 2026 ⏱️ 6:04 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు జనవరి 23 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ

బిజెపి ఆత్మ కమిటీ డైరెక్టర్ బిజెపి పూర్వపు మండల అధ్యక్షులు పాలాటి మాధవ స్వామి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమర యోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు వాడపాలెంలో ఘనంగా జరిగాయి దీనికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం విచ్చేశారు ముందుగా వాడపాలెం గ్రామంలో ఉన్న సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆరెస్సెస్ ఖండ ప్రముఖ్ తొగరు సీతారామాంజనేయులు ముఖ్య వక్తగా హాజరై మాట్లాడారు
ఆజాద్ హింద్ ఫౌజు దళపతి — నేతాజీ అఖండ భారత జాతి కన్న మరో శివాజీ సాయుధ సంగ్రామమే న్యాయమని నమ్మి, స్వతంత్ర భారతావని మన స్వర్గమని చాటి, ప్రతి భారతీయుడు ఒక సైనికుడై దేశం కోసం ప్రాణార్పణ చేయాలని పిలుపునిచ్చి, “జై హింద్” నినాదంతో హింద్ ఫౌజును నడిపించిన వీరుడని గగనశిగలకు ఎగసి కనుమరుగైన అమర విప్లవ యోధుడని కొనియాడారు ఈ రోజు దేశమంతా నేతాజీ జన్మదినాన్ని పరాక్రమ్ దివస్గా జరుపుకుంటోంది. ఆయన ఆదర్శాలు, ధైర్యం, త్యాగం ఇప్పటికీ యువతకు ప్రేరణ. ఆజాద్ హింద్ ఫౌజ్‌తో బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన ఆ మహానుభావుడి స్ఫూర్తి ఎన్నటికీ మరువలేనిదని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి కొత్తపేట మండల అధ్యక్షులు సంపతి కనకేశ్వరరావు , గొలకోటి వెంకటేశ్వరరావు , సింగినీడి గోవింద స్వామి, పచ్చి పులుసు వెంకటేష్ గుప్తా , శ్రీఘాకోళ్ళపు భీమేశ్వర రావు, బండారు చిన గంగరాజు, కట్టా శ్రీనివాస రావు, భమిడిపాటి లక్ష్మీ నారాయణ, పెదపూడి బాపిరాజు, ఆదిన సూర్య నారాయణ, సుతాపల్లి అచ్చియ్య, సలాది రామకృష్ణ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Scroll to Top