సూళ్లూరుపేటలో ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు
పయనించే సూర్యుడు జనవరి 23 సూళ్లూరుపేట నియోజకవర్గం దాసు
సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రివర్యులు మరియు యువనేత శ్రీ నారా లోకేష్ 43వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, సూళ్లూరుపేట నియోజకవర్గవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. శాసనసభ్యురాలు డా. నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. మెగా ఉచిత వైద్య శిబిరం:సూళ్లూరుపేట స్థానిక సత్యసాయి కళ్యాణ మండపంలో ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. వందలాది మంది ప్రజలు తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకోగా, వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. “ప్రజల ఆరోగ్యమే మన రాష్ట్ర భాగ్యం. మన నాయకుడి పుట్టినరోజున ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆయన పట్ల మనకున్న అభిమానానికి నిదర్శనం” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.రక్తదాన శిబిరం మరియు సభ:స్థానిక R&B గెస్ట్ హౌస్ ఆవరణలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి మరియు బహిరంగ సభకు అద్భుతమైన స్పందన లభించింది. స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేసిన పార్టీ కార్యకర్తలను, యువతను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. సభలో ఆమె ప్రసంగిస్తూ, “మీ ఉత్సాహమే మన పార్టీకి బలం. లోకేష్ నాయకత్వంలో మన సూళ్లూరుపేటను మరింత అభివృద్ధి చేసుకుందాం” అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకు ఆమె హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తడలో అన్నదాన సందడి:*
వేడుకల్లో భాగంగా తడ మండల కేంద్రంలో ఎమ్మెల్యే డా. విజయశ్రీ పార్టీ కార్యకర్తలతో కలిసి భారీ కేక్ కట్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు స్వయంగా భోజనాలను వడ్డించారు.ఈ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
