PS Telugu News
Epaper

మిషన్ భగీరథ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించాలి .

📅 24 Jan 2026 ⏱️ 6:20 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

మిషన్ భగీరథ స్కీమ్లో రాష్ట్రవ్యాప్తంగా 16 వేల మంది పనిచేస్తున్నారు. వారికి మిషన్ భగీరథ కార్పొరేషన్ ఏర్పాటు చేసి సకాలంలో వేతనాలు చెల్లించాలని టియుసిఐ రాష్ట్ర అధ్యక్షులు కే సూర్యం గారు అన్నారు.

// పయనించే సూర్యుడు// న్యూస్ జనవరి 25మక్తల్ //

తెలంగాణ ప్రగతిశీల మిషన్ భగీరథ వర్కర్స్ యూనియన్ మక్తల్ సెగ్మెంట్ కమిటీ సమావేశం సత్యసాయి మందిరంలో సంఘం అధ్యక్షులు ఆంజనేయులు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య వక్కలుగా కే సూర్యం టియుసిఐ రాష్ట్ర అధ్యక్షులు, టి యు సి ఐ జిల్లా అధ్యక్షులు ఎస్ కిరణ్ లు హాజరై ప్రసంగించారు.
మిషన్ భగీరథ స్కీమ్లో పనిచేస్తున్న కార్మికులు సకాలంలో జీతాలు లేక తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. సొంత డబ్బులతో వాహనాలకు పెట్రోల్ పోసుకొని విధులు నిర్వహిస్తున్న యాజమాన్యాలకు కనికరం లేకుండా పోయింది. నెలల తరబడి వేతనాలు బకాయిలో ఉండడం, పీఎఫ్ బకాయిలో ఉండడం వలన కార్మికులకు సంక్షేమం చేకూరడం లేదని అన్నారు. వేతనాలు లేకుండా కార్మికులు ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే మిషన్ భగీరథ కార్మికులకు వేతనాలు చెల్లించాలి. అలాగే మిషన్ భగీరథ స్కీమును కార్పొరేషన్ గా మార్చి నేరుగా కార్పొరేషన్ ద్వారా వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి మహేష్ శెట్టి లక్ష్మణ్ కాసిం సత్యనారాయణ బసంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top