స్వచ్ఛ రథం ను ప్రారంభించిన శాసనసభ్యులు జె.సి. అస్మిత్ రెడ్డి
పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 24(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
మండల కేంద్రమైన యాడికి నందు లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంనందు స్వర్ణ ఆంధ్రా… ఈరోజు
స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ రథం ప్రారంభోత్సవంలో పాల్గొన్న తాడిపత్రి శాసనసభ్యులు జె.సి. అష్మిత్ రెడ్డి గారు… అధికారులు, ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేసి ప్లాస్టిక్ ను నిషేధిద్దాం. స్వర్ణ యాడికి, స్వర్ణ ఆంధ్రాను కాపాడుదాం అంటూ నినదించారు..అందులో భాగంగా స్వచ్ఛ రథం ప్రారంభోత్సవం చేసి గ్రామస్తుల నుండి అట్టపెట్టలను, బాటిల్లను సేకరించి దానికి విలువ కట్టి అంతకు సరిపడా ఇంటి సరుకులను శాసనసభ్యులు జె.సి.అస్మిత్ రెడ్డిగారు స్వయంగా అందించారు. స్వచ్ఛ రథం ద్వారా పరిసరాలు పరిశుభ్రంగా ఉండటమే కాకుండా ఇంటికి కావలసిన చిన్నపాటి సరుకులు వస్తుండడంతో ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే జె.సి.అష్మిత్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల మూడో శనివారం”స్వర్ణ ఆంధ్రా….స్వచ్ఛ ఆంధ్రా” కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారని అన్నారు.”స్వర్ణ ఆంధ్రా….స్వచ్ఛ ఆంధ్రా” కార్యక్రమం అన్ని వర్గాల వారు మండలంలోని ప్రభుత్వ పాఠశాల, కళాశాలలు,ప్రభుత్వ కార్యాలయాలు తదితర విభాగాలలో అంకిత భావంతో ప్రతి ఒక్కరు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని అధికారులను, ప్రజలను కోరిన తాడిపత్రి శాసనసభ్యులు జె.సి. అస్మిత్ రెడ్డి ఈ కార్యక్రమంలో జిల్లా,మండల స్థాయి అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
