PS Telugu News
Epaper

శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా ప్రకటించాలి

📅 24 Jan 2026 ⏱️ 6:41 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

గిరిజన యువ నాయకుడు ఆకాష్ నాయక్

శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15న ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించాలి

( పయనించే సూర్యుడు జనవరి 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)

గిరిజనుల ఆరాధ్య దైవం సమాజ సంస్కర్త మరియు ధార్మిక నాయకుడైన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఫిబ్రవరి 15న ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని గిరిజన యువ నాయకుడు ఆకాష్ నాయక్ అన్నారు. సేవాలాల్ మహారాజ్ కేవలం బంజారాల సమాజానికే కాకుండా, మొత్తం యావత్ భారతదేశానికి ధర్మానికి ఆదర్శప్రాయాయమని పేర్కొన్నారు. అహింసను ప్రతిపాదికగా తీసుకొని హింసను పాపమని, మత్తు పదార్థాలు మరియు ధూమపానం శాపమని హెచ్చరించారు. కుల, మత వర్మ విభజనలను నిర్మూలించి సమాజంలో సమానత్వానికి కృషి చేశారు. బంజారాల పరువు ప్రతిష్టను పునర్మించారు. గిరిజనుల సంచార జీవనశైలిని స్థిరీకరించి వ్యవస్థీకృత జీవన విధానాన్ని ప్రవేశపెట్టారు. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ బోధనలు మరియు సిద్ధాంతాలు నేటి సమాజానికి కూడా మార్గదర్శకమని, ఆయన జయంతి రోజును సెలవుదినంగా ప్రకటించాలని ఆకాష్ నాయక్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఈ ఉత్సవం కేవలం గిరిజనులే కాకుండా యావత్ భారత దేశ ప్రజల ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా, సమాజంలోని ప్రతి వర్గానికి సేవలల్ మహారాజ్ యొక్క ఆధ్యాత్మిక, సామాజిక విశిష్టతను చాటి చెప్పేందుకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం స్పందించి దృష్టిలో పెట్టుకొని ఫిబ్రవరి 15న శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం.

Scroll to Top