కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
పయనించే సూర్యుడు జనవరి 26 (సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు)
77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా సూళ్లూరుపేటలో స్థానిక ఆర్ఎంబి గెస్ట్ హౌస్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు జరిపారు ఈ కార్యక్రమ లో కాంగ్రెస్ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇంచార్జ్ మావుడూరు వెంకటాచలపతి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ. కాంగ్రెస్ పార్టీ నాయకులందరితో కలసి జాతీయ జెండాని ఎగరవేశారు అనంతరం నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి, చాక్లెట్లు పంచారు , అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి, గండవరం రమేష్ రెడ్డి, సూళ్లూరుపేట మండల అధ్యక్షులు బద్దిపూడి రాజారెడ్డి, ఓబి సెల్ అధ్యక్షులు భాస్కర్, ఎస్సీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ వాటంభేటీ శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జానకి రామయ్య, పొన్న చిన్నయ్య, రామదాసు, బొగ్గుల జంగయ్య,తదితరులు పాల్గొన్నారు
