రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలి : సర్పంచ్ అజ్మీర సురేష్ నాయక్
పయనించే సూర్యుడు జనవరి 26 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూర్ మండలం రేపల్లె వాడ : భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శమని రేపల్లెవాడ సర్పంచ్ అజ్మీర సురేష్ నాయక్ అన్నారు. సోమవారం 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రేపల్లెవాడ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అజ్మీర సురేష్ నాయక్ మాట్లాడుతూ.. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించిందని, వారి మేధోకృషితోనే మన రాజ్యాంగం రూపుదిద్దుకుందని కొనియాడారు. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారత్ వర్ధిల్లుతుండటం గర్వకారణమని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాతలను స్మరిస్తూ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి రాంప్రసాద్ ఏన్కూర్ మండల యువజన అధ్యక్షులు నిమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ నాయకులు, తంబళ్ల సామేలు నిమ్మల నరేందర్ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.