విద్యానికేతన్ హై స్కూల్లో 16వ జాతీయ ఓ టర్ల దినోత్సవ వేడుకలు
పయనించే సూర్యుడు జనవరి 26 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ
ఐ.పోలవరం మండలం, గుత్తెనదీవి సాయిరామ్ విద్యానికేతన్ హై స్కూల్ లో16వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ లంకలపల్లి దుర్గాదేవి మునిరాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ 18 ఏళ్ళు నిండిన ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలని, యువత ఓటర్లుగా నమోదు చేసుకుని ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కావాలనీ, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు.మన ఓటు మన భవిష్యత్ కు పునాదనీ, బాధ్యతాయుతమైన ఓటరుగా దేశ అభివృద్ధికి తోడ్పడదామని పిలుపునిచ్చారు. బూత్ లెవెల్ ఆఫీసర్ సత్తాల శ్రీనుబాబు విద్యార్థులచే ఓటరు ప్రతిజ్ఞ, నిజాయితీగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం, మన ఓటు మన భవిష్యత్తు, ఓటు మీకొక వరం వదులుకోవద్దు అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు.పాఠశాలలో నిర్వహించిన వక్తృత్వ, వ్యాసరచన, ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు స్కూల్ కరస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు బహుమతులు అందజేశారు . ఈ కార్యక్రమంలో సర్పంచ్ లంకలపల్లి దుర్గాదేవి మునిరాజు , లంకలపల్లి కృష్ణ, కరస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు,బూత్ లెవల్ అధికారులు సత్తాల శ్రీనుబాబు, కోలా చంద్రశేఖర్, బొంతు జయబాబు, బొమిడి నాగేంద్ర వర్మ, నాటి ధనరాజు, ఎమ్ .చిన నీలాంబరం తదితరులు పాల్గొన్నారు.
