హిందూవుల ఐక్యతే హిందూ ధర్మపు అసలైన బలం
పయ నించే సూర్యుడు జనవరి 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ వడమలపేటలో ఘనంగా హిందూ సమ్మేళనం
సమాజంలో విభేదాలకు తావివ్వకుండా ఐక్యతతో ముందుకు సాగడమే హిందూ ధర్మం యొక్క అసలైన ఆత్మ అని చిలుకూరి కృష్ణ స్వామి స్పష్టం చేశారు. వడమలపేటలో శ్రీ సంజీవరాయ స్వామి దేవాలయం ప్రాంగణంలో హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన హిందూ సమ్మేళనంలో కృష్ణ స్వామి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులాలు మన ఇంటి గడపలోపలే ఉండాలని, గడప దాటిన తరువాత మనమంతా ఒక్కటే హిందువులం అని స్పష్టంగా పేర్కొన్నారు. హిందూ ధర్మం అంటే కేవలం ఆచారాలు, సంప్రదాయాలకే పరిమితం కాదని, అది మానవత్వం, సహనశీలత, పరస్పర గౌరవం, శాంతి సహజీవనానికి మార్గదర్శకమని అన్నారు. సర్వే భవంతు సుఖినః అనే భావన హిందూ సంస్కృతి మూల సూత్రమని, ప్రపంచానికి శాంతి మార్గాన్ని చూపిన ధర్మం హిందూ ధర్మమేనని చెప్పారు.రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపనకు వందేళ్లు పూర్తైన సందర్భంగా ఈ హిందూ సమ్మేళనాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.ముఖ్య వక్త గ విచ్ఛేసిన ABVP (అఖిల భారతీయ విద్యార్థి పరిషత్), రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ మార్గాని సోమశేఖర్ గారు మాట్లాడుతూ.. సేవా భావనతో నిండిన సంస్కృతి భారతీయ సంప్రదాయమని, ప్రపంచానికి ఆధ్యాత్మిక దిశానిర్దేశం చేసిన దేశం భారత్ అని పేర్కొన్నారు. సమాజంలో అమలు చేయాల్సిన పంచ పరివర్తనలను వివరించారు. సామాజిక సమరసత, పర్యావరణ పరిరక్షణ, పౌర విధుల పాటింపు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ప్రోత్సాహం, స్వదేశీ ఉత్పత్తుల వినియోగం వంటి అంశాలను ప్రజలకు తెలియజేశారు. ఈ వేదికపై పలువురు వక్తలు మాట్లాడుతూ భారతదేశం వేదభూమి, కర్మభూమి, పుణ్యభూమి, పవిత్రభూమి అని కొనియాడారు. త్యాగం, తపస్సు,ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ జిల్లా సహ బౌధిక్ ప్రముఖ్ దనంజయ, ఖండ కార్యవాహ కేశవ, సాయి, మురళి, రవి , భక్తులు, ప్రజలు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు.