PS Telugu News
Epaper

గిరిజన ఆశ్రమ-ఏపీ మోడల్ స్కూల్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి

📅 27 Jan 2026 ⏱️ 6:55 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు జనవరి 27 నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న

నంద్యాల జిల్లా, మహానంది మండలంలోని ట్రైబల్ గిరిజన ఆశ్రమ పాఠశాలను మంగళవారం జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, వంటగది, మరుగుదొడ్లు, వసతి గదులు తదితర మౌలిక వసతులను సమగ్రంగా పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలు, భోజన ఏర్పాట్లు, పారిశుద్ధ్య పరిస్థితులపై కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ వారికి ఏవైనా సమస్యలు ఉన్నాయా, భోజనం, వసతి, విద్య సంబంధిత ఇబ్బందులు ఏమైనా ఎదురవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను తెలియజేయాలని సూచించారు.అనంతరం నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం ప్రాంతంలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్‌ను కూడా జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. అక్కడి వంటగదిని పరిశీలించి పరిశుభ్రత, భోజన నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలుపై వివరాలు అడిగి తెలుసుకుని, విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందేలా తగిన సూచనలు జారీ చేశారు. పాఠశాలలలో విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, విద్యా ప్రమాణాలు అత్యంత ప్రాధాన్యతగా పేర్కొంటూ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టి ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.

Scroll to Top