PS Telugu News
Epaper

ఉపాధి హామీపై కేంద్ర వైఖరి ప్రజావ్యతిరేక, కూలీల వ్యతిరేకమైనది

📅 27 Jan 2026 ⏱️ 7:00 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్

-. కేంద్రం తెచ్చిన కొత్త ఎం జి ఎన్ రాం పథకాన్ని రద్దు చేసి పాత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునంప్రారంభించాలి -. అఖిలభారత ఐక్య రైతు సంఘము ఐ యు కె ఎస్ రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్
ఉపాధి హామీపై కేంద్ర వైఖరి ప్రజావ్యతిరేక, కూలీల వ్యతిరేకమైనదని,కేంద్రం తెచ్చిన కొత్త ఎం జి ఎన్ రాం పథకాన్ని రద్దు చేసి పాత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునంప్రారంభించాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం అధ్యక్షులు వి ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు.సిరికొండలో మంగళవారం నాడు అఖిలభారత ఐక్య రైతు సంఘం, ఏ ఐ యు కె ఎస్ *అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ ఏఐపీకేఎంఎస్ సంఘాల ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకాన్ని కాపాడాలి అని వ్యవసాయ కూలీలతో ర్యాలీ నిర్వహించి ఎంపిడివో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.కార్యక్రమం లో అఖిలభారత ఐక్య రైతు సంఘం కె ఎస్ రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్ మాట్లాడుతు: కేంద్ర ప్రభుత్వం సంపరుల మేలు కోసం వ్యవసాయ కూలీలపై కక్షకట్టి వ్యవసాయ కూలీలకు ఉపాధి లేకుండా కుట్రలకు పూనుకుంటుందన్నారు.కేంద్రప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఎం జి ఎన్ రామ్ స్కింను రద్దు చేసి మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకంను నిర్వీర్యం చేస్తుంది అన్నారు.కేంద్ర ప్రభుత్వం మహాత్మ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేసి రద్దు చేసే కుట్రలో భాగంగానె కొత్తగా ఎం జి రామ్ పథకాన్ని తెచ్చి కూలీల కడుపు కొట్టె ప్రయత్నం చేయడం కూలీలకు తీరని అన్యాయం చేయడమే అవుతుందన్నారు. వామపక్ష పార్టీలు, పేద ప్రజలు అనేక ఏళ్ళుగా కొట్లాడిన ఫలితంగా మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆనాడు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంను చట్ట రూపంలో తీసుకొచ్చారన్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ కూలీలకు ప్రధాన ఉపాధిగా అనేక హక్కులు చట్ట రూపంలో తీసుకురావడం జరిగిందన్నారు. నిరుపేద కూలీలు ఆకలి చావులు చావకుండా కనీసం బతుకు నెట్టుకొచ్చేలా ఈ చట్టం ఉపయోగపడిందన్నారు. అనేక రాష్ట్రాల్లో ఈ చట్టం వల్ల వ్యవసాయ కూలీలు బతకగలిగిందన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 12 ఏళ్లుగా ప్రధాని మోడీ విసిగ్గుగా కార్పొరేట్ కంపెనీల సేవ కోసం నిరుపేద కుళ్ళపై కక్షగట్టి రాను రాను రాజు గుర్రం గాడిద అయినట్లు నిధుల్లో కోత పెడుతూ అసలుకే ఎసరు తెచ్చేలా కుట్రలు పన్నారన్నారు. పేరు మార్చీ, నిధుల్లో కోత పెట్టి, ఉపాధి చట్టబద్ధ హక్కును తుంగలో తొక్కి నిరుగార్చి పథకాన్ని లేకుండా చేసే కుట్రలకు పునుకుంటున్నారు అన్నారు. ఉపాధి హామీ అన్నది కేంద్రం బాధ్యత అని అది విస్మరించి రాష్ట్రాలపై కూడా రుద్ధి కుట్రలకు పాల్పడుతున్నారు. ఉపాధి హామీ పనుల కోసం ఇప్పటి వరకు కేంద్రం 100శాతం నిధులు ఇచ్చేది కానీ ఇప్పుడు కేంద్రం 60శాతం, రాష్ట్రం 40శాతం ఇవ్వాలి అని చేతులు దుల్పుకునే వైఖరిని తీసుకున్నది అన్నారు.కావున ఉపాధిని ఇవ్వడం రాజ్యాంగం కల్పించిన కనీస బాధ్యత. కూలీల పరిస్థితిని అర్థం చేసుకొని కొత్తగా తెచ్చిన ఎం జి ఎన్ రామ్ స్కింను రద్దు చేసి మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకంను కొనసాగించాలి అని ఆయన డిమాండ్ చేశారు.కార్యక్రమంలోఅఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక ఏ ఐ పి కే ఎం ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి రామకృష్ణ, అఖిలభారత ఐక్యరైతు సంఘం యూకే ఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్ సురేష్, ప్రధానకార్యదర్శి బి బాబన్న జిల్లా ప్రధానకార్యదర్శి, కార్యదర్శి ఆర్ దామోదర్,
అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి ఇ రమేష్,ఏఐయు కె ఎస్ ార్యదర్శి జి సాయిరెడ్డి, జిల్లా కోశాధికారి ఎం లింబాద్రి, జిల్లా నాయకులు బి కిశోర్ ,జి బాల్ రెడ్డి, జి ఎర్రన్న,ఎల్ గోపి,మండల నాయకులు పి ఎల్లయ్య,జే రాజు, కట్ట రాములు, ఏ ఆశిస్, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top