PS Telugu News
Epaper

పదో తరగతి విద్యార్థుల కోసం ప్రతిభా నగదు పురస్కారాలు : బిసి రాజారెడ్డి”

📅 28 Jan 2026 ⏱️ 2:13 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు జనవరి 28,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న

నా తల్లిదండ్రులు కీ. శే. బిసి గుర్రెడ్డి, బిసి లక్ష్మమ్మ దంపతుల జ్ఞాపకార్థం రూ.4,00,000 లక్షల నగదు పురస్కారాలు

బనగానపల్లె నియోజకవర్గ విద్యార్థులు నంద్యాల జిల్లా స్థాయిలో ప్రధమ ర్యాంకు సాధిస్తే విద్యార్థికి రూ.70,000 (డెబ్భై వేల రూపాయల) నగదు బహుమతి

నియోజకవర్గ స్థాయిలో ప్రథమ ర్యాంకు విద్యార్థికి రూ.50,000 నగదు బహుమతి

నియోజవర్గంలోని ఆయా పాఠశాలల్లో ప్రధమ ర్యాంకు సాధించిన విద్యార్థికి రూ. 5000 నగదు బహుమతి

ప్రతిభా నగదు పురస్కారాలను సద్వినియోగం చేసుకోండి : బిసి రాజారెడ్డి

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించేందుకే ప్రతిభా పురస్కారాలు

పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులకు ప్రతిభా నగదు పురస్కారాలు అందజేయాలని నిర్ణయించినట్లు బనగానపల్లె మాజీ సర్పంచ్ బిసి రాజారెడ్డి అన్నారు. తల్లిదండ్రులు కీ.శే. బిసి గుర్రెడ్డి, బిసి లక్ష్మమ్మ దంపతుల జ్ఞాపకార్థం పదో తరగతి విద్యార్థులకు ప్రతిభా నగదు పురస్కారాలు ప్రతియేటా అందజేస్తున్నామన్నారు. 2021 – 2022 విద్యా సంవత్సరం నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు బిసి రాజారెడ్డి తెలిపారు. అందులో భాగంగా ఈ ఏడాది కూడా బనగానపల్లె నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే విద్యార్థులను ప్రోత్సహించేందుకు రూ.4,00,000 లక్షల నగదు పురస్కారాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు బుధవారం ప్రతిభ నగదు పురస్కారాలకు సంబంధించి కరపత్రాలను బిసి రాజారెడ్డి విడుదల చేశారు. బనగానపల్లె నియోజకరవ్గ విద్యార్థులు నంద్యాల జిల్లా స్థాయిలో ప్రధమ ర్యాంకు సాధిస్తే సదరు విద్యార్థికి రూ. 70,000 ( డెబ్భై వేల రూపాయల) నగదు బహుమతి, ఆయా మండలాలకు సంబంధించి నియోజకవర్గ స్థాయిలో ప్రధమ ర్యాంకు సాధించిన విద్యార్థికి రూ. 50,000 నగదు బహుమతి అందిస్తామన్నారు. బనగానపల్లె నియోజకవర్గం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, కస్తూరిబా పాఠశాలలు, ఏపీ మోడల్ స్కూల్, ఉర్దూ పాఠశాలలు, గురుకుల విద్యాలయాల్లో చదువుతూ 10వ తరగతి ఫలితాల్లో ఆయా పాఠశాలల్లో ప్రధమ ర్యాంకు సాధించిన వారికి రూ.5000 వేలు నగదు పురస్కారం అందించి సత్కరిస్తామన్నారు. నియోజకవర్గ స్థాయి, జిల్లాస్థాయిలో ఒకే మార్కులు (ఫస్ట్ ర్యాంకు) ఒకరి కంటే ఎక్కువ మంది సాధించినా వారందరికీ కూడా నగదు ప్రతిభా పురస్కారం అందజేసి సత్కరిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో
చదివే విద్యార్థులను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని బిసి రాజారెడ్డి తెలిపారు. మాజీ రాష్ట్రపతి, ప్రముఖ సైంటిస్ట్ అబ్దుల్ కలాం , ఇంజనీర్ల పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి ఎంతోమంది ప్రముఖులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించారన్నారు. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థిని విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. వారికి తన వంతు బాసటగా నిలిచేందుకు ఈ నగదు ప్రతిభా పురస్కారాలను అందజేస్తున్నామని తెలిపారు. పదో తరగతి విద్యార్థిని, విద్యార్థులు బాగా చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించి మండల స్థాయి, జిల్లా స్థాయిలో ప్రధమ స్థానాల్లో నిలిచి నగదు పురస్కారాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. బనగానపల్లె నియోజకవర్గం లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థిని విద్యార్థులు ఈ సదా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయా పాఠశాలలకు సంబంధించిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు నగదు ప్రతిభా పురస్కారాలకు సంబంధించి విద్యార్థులకు వివరించి వారు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో రిటైర్డ్ హెచ్ఎంలు పి. నాగపుల్లయ్య, SMD ఇస్మాయిల్, టీడీపీ నాయకులు బొబ్బల మహేశ్వరరెడ్డి, నుసి విష్ణువర్ధన్ రెడ్డి, డి.మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.

Scroll to Top