PS Telugu News
Epaper

సూళ్లూరు పేట ఎమ్మెల్యే మార్నింగ్ విత్ ఎంఎల్ఏ

📅 28 Jan 2026 ⏱️ 4:14 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు జనవరి 28 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు )

సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో మన సూళ్లూరుపేట ఎమ్మెల్యే మార్నింగ్ విత్ ఎమ్మెల్యే అంటూ ప్రతి వాడనందు ఉదయాన్నే గుడ్ మార్నింగ్ చెప్తూ ప్రతి ఒక్కరిని సొంత వాళ్ళ లాగా పలకరించుకుంటూ ప్రతి ఒక్క ఏరియాలో సమస్యలు ఏమున్నాయని అడిగి తెలుసుకుంటున్నారు కానీ ఒక్క సమస్య కూడా క్లియర్ అవ్వట్లేదు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది మీరు వస్తున్నారని తెలిస్తే అక్కడ ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్లు హడావుడిన కాలువలు క్లీన్ చేయటం సందుల్లో చెత్త క్లియర్ చేయటం తూతూ మంత్రంగా చేసి వెళ్ళిపోతున్నారు అంతే తప్ప అభివృద్ధి అనేది లేదు సూళ్లూరుపేట మున్సిపాలిటీలో వీధి దీపాలు చాలా దగ్గర వెలగట్లేదు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించిని అధికారులు ఆ చీకటిలో ఏం జరిగినా ఎవరు బాధ్యత వహిస్తారు ఎవరు దొంగ ఎవరు మంచివాళ్ళో ఎవరికీ తెలుస్తుంది ఇలాంటి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండగా ఎక్కడ అభివృద్ధి జరిగింది ఎమ్మెల్యే వచ్చిన రోజున మాత్రం ఆ ఏరియా శుభ్రంగా ఉంటుంది మిగతా రోజుల్లో అదే తంతు ఇలా ఉన్నప్పుడు అభివృద్ధి ఎక్కడ జరిగినట్టు ఒక కాల్వ డ్రైనేజీ తీయాలన్న ఎమ్మెల్యేకి చెప్పాలి ఒక లైట్ వెయ్యాలన్న ఎమ్మెల్యే కి చెప్పాలి ఒక రోడ్డు వెయ్యాలన్న ఎమ్మెల్యే చెప్పాలి ఇలా ఉంది సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిస్థితి శాసనసభ్యులు ఉదయం 7 గంటలకు ఎమ్మెల్యే మేడం వస్తుందని తెలుసుకొని అప్పుడు క్లీనింగ్ మొదలుపెట్టారు క్లీనింగ్ పనులు సూళ్లూరుపేట ఎమ్మెల్యే వచ్చే లోపల పైపైన మెరుగులు దిద్దుతున్నారు ఇలాగనే ఎమ్మెల్యే వచ్చే లోపల ప్రతి ఏరియాలో పై పైన మెరుగలే దిద్దుతున్నారు ఎమ్మెల్యే వచ్చి దిగంగానే ఎమ్మెల్యే చుట్టూ 20 మంది 30 మంది గుంపులుగా ఎమ్మెల్యే చుట్టూ ఉంటారు అప్పుడు ఎమ్మెల్యే కి ఎలా తెలుస్తుంది అభివృద్ధి చెందిందో లేదో అని ఇలాంటి అభివృద్ధి ప్రజలకు అవసరం లేదు శాశ్వతమైన అభివృద్ధి కావాలి సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయ్ శ్రీ కి ప్రజలు అంటే ఎంతో అభిమానం ఆ అభిమానాన్ని అడ్డం పెట్టుకొని తూతూ మంత్రంగా పనులు కాని చేస్తున్నారు ఎక్కడ అభివృద్ధి జరిగిందో ఒకసారి కళ్ళారా చూడండి ఎమ్మెల్యే మేడం సూళ్లూరుపేట ప్రజల కోరుకునేది శాశ్వతమైన అభివృద్ధి కావాలి అనుకుంటున్నారు

Scroll to Top