PS Telugu News
Epaper

సిద్దాపూర్ గ్రామపంచాయతీకి కంప్యూటర్ అందించిన వార్డ్ సభ్యులు స్రవంతి మహిపాల్

📅 28 Jan 2026 ⏱️ 7:15 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పాఠశాల విద్యార్థులకు క్యారం బోర్డులు మరియు కుక్కర్ అందచేత

పాల్గొన్న సర్పంచ్ బాసు నాయక్ మరియు సీనియర్ నాయకులు ఎల్లారం శేఖర్ రెడ్డి

( పయనించే సూర్యుడు జనవరి 28 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)

కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామపంచాయతీ 9 వ వార్డు నెంబర్ స్రవంతి మహిపాల్ గ్రామపంచాయతీ కార్యాలయానికి కంప్యూటర్ అందించడం జరిగింది. అదేవిధంగా చింతగట్టు తండా లోని అంగన్వాడి కేంద్రానికి కుక్కర్ ను అందించడం జరిగింది . అంతేకాకుండా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఐదు క్యారంబోర్డ్లను అందించడం జరిగింది. అనంతరం స్రవంతి మహిపాల్ మాట్లాడుతూ… గ్రామపంచాయతీ అవసరాల దృష్ట్యా గ్రామపంచాయతీ కార్యాలయానికి నూతన కంప్యూటర్ను అందించడం జరిగిందని మరియు విద్యార్థుల అవసరాల కోసం పప్పు కుక్కర్ తో పాటు హై స్కూల్ విద్యార్థులకు క్యారంబోర్డ్లను అందించడం జరిగిందని అన్నారు. భవిష్యత్తులో కూడా విద్యార్థులకు ఏ అవసరమైన సహాయం చేయడానికి ముందు ఉంటాను స్రవంతి మహిపాల్ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విస్లావత్ బాసు నాయక్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శేఖర్ రెడ్డి మరియు గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top