విజేత కళాశాల విద్యార్థిని శైలజ ప్రతిభ
జిల్లా స్థాయి ఈనాడు ప్రతిభ పాటవ పోటీలలో విజేత కళాశాల విద్యార్థిని
( పయనించే సూర్యుడు జనవరి 28 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
హైదరాబాద్ మహబూబియా బాలికల జూనియర్ కళాశాలలో జరిగిన రంగారెడ్డి జిల్లాస్థాయి ఈనాడు ప్రతిభ పాటవ పోటీలలో షాద్నగర్ పట్టణ విజేత జూనియర్ కళాశాల విద్యార్థిని కే. శైలజ ఉపన్యాస పోటీలో జిల్లా స్థాయిలో రెండవ బహుమతి పొందినది.ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన జిల్లా స్థాయిలో పోటీల లో షాద్నగర్ పట్టణం విద్యార్థికి బహుమతి రావడం హర్షించదగ్గ విషయం. ఈనాడు ప్రతిభ పాటవ పోటీలు నిర్వహిస్తూ విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీస్తూ విద్యార్థులను ప్రోత్సాహించడం విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరమని కళాశాల ప్రిన్సిపల్ కె.ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపన్యాస బృందం విద్యార్థిని అభినందించారు. షాద్నగర్ పట్టణంలో ఈ పోటీలు నిర్వహిస్తూ కో ఆర్డినేటర్ గా విద్యార్థులను ప్రోత్సహించిన టీవీ రంగయ్య సార్ యొక్క కృషిని కొనియాడినారు.టీవీ రంగయ్య సార్ ప్రోత్సాహం వల్లే విద్యార్థులు వివిధ రంగాలలోజిల్లా , రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటున్నారని వారిని అభినందించారు.