PS Telugu News
Epaper

సత్తుపల్లి మున్సిపాలిటీఇండిపెండెంట్ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ

📅 29 Jan 2026 ⏱️ 5:13 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

బానోతు నందు నాయక్

పయనించే సూర్యుడు జనవరి 29 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్

సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇండిపెండెంట్ 9 వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా బానోతు నందు నాయక్ ఎస్సీ,ఎస్టీ,బీసీ మరియు మైనార్టీ ప్రజల కోసం పోరాటం చేసిన మీ పోరాట వీరుడు బానోతు నందు నాయక్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గురువారం నామినేషన్ దాఖలు చేయడం జరిగినది,
9 వ వార్డు గత పది సంవత్సరాల నుంచి సింగరేణి మీద పోరాటం చేసి సింగరేణి బ్లాస్టింగ్ వల్ల ప్రజల ఇల్లులు శిధిలావస్థకు చేరుకున్న వాటిని సింగరేణి మీద పోరాటం చేసి,నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో చెన్నై కోర్టులో కేసు వేసి విజయం సాధించిన ఏకైక వ్యక్తి మీ బానోతు నందు నాయక్,కోర్టు ఆర్డర్ కాపీ తీసుకుని వచ్చి సింగరేణితో శిథిలావస్థలో ఉన్న ప్రజల ఇళ్ళని నిర్మించి మరియు రిపేర్లు చేయించేటట్టు చేశారు, అలాగే సింగరేణితో వాటర్ ప్లాంట్, మెడికల్ క్యాంపులు, కళ్యాణ మండపం కూడా కట్టించారు సింగరేణి నిధులతో,ఉచిత కోచింగ్ లు నాలుగు రకాలవి ఏర్పాటు చేశారు, డ్రైనేజీలు, సీసీ రోడ్లు సింగరేణి నిధులతో వేయించారు, స్థానికులకి సింగరేణి ప్రైవేట్ క్యాంపుల్లో కొంతమందికి ఉద్యోగాలు కల్పించారు, మరియు ఎన్జీటీ ఆర్డర్ ద్వారా గా టిప్పర్ లారీలను రద్దుచేసి స్థానికుల లారీ వాళ్ళకి లోడింగ్ అవకాశం కల్పించారు, కావున వార్డు ప్రజలందరికీ తెలియజేయునది ఏమనగా మీ అమూల్యమైన ఓటును నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ప్రజలు కోసం పోరాటం చేసే ఏకైక వ్యక్తినీ మీ కుటుంబ సభ్యుడిని అయినా నేను నీ బానోతు నందు నాయక్ కి ఓటు వేసి గెలిపించగలరు అని అభ్యర్థిస్తున్నాను.

Scroll to Top