భీష్మ ఏకాదశి సందర్భంగా 17వ ఏకాహ మహోత్సవం
పయనించే సూర్యుడు జనవరి 29 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ఐ పోలవరం మండలం కేశనకుర్రు పెద్ద చెరువు గట్టు ఆధ్వర్యంలో పుష్కర ఘాట్ వద్ద వేంచేసియున్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయ సన్నిధిలో 17వ ఏకాహ భజన మహోత్సవం భజన గురువు గుబ్బల సూర్య సత్యనారాయణ పర్యవేక్షణలో గ్రామ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రేకాడి అర్జునరావు భజన బృందం గుత్తుల గోవిందరావు భజన బృందం పోతాబత్తుల చిన్నవెంకటరావు పోతాబత్తుల సూరిబాబు ల భజన బృందాలచే హరినామ సంకీర్తన చేయడం జరిగింది ఈ సందర్భంగా అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్ ముమ్మిడివరం సబ్ డివిజన్ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు మాట్లాడుతూ మహాభారతంలో శంతన మహారాజు పుత్రుడు భీష్ముడు పూర్వ నామం “దేవవ్రతుడు”భారతంలో ఒక ప్రధానమైన శక్తివంతమైన పాత్ర భీష్ముడిది సత్య వర్తనుడిగా పరాక్రముడిగా భీష్ముని పాత్ర అనిర్వచనీయమైనది మానవుడు ముక్తిని పొందటానికి విష్ణు సహస్రనామాన్ని అందించిన మహా పురుషుడు భీష్ముడు అని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ ఎస్ ఎఫ్ మండల సహా కన్వీనర్ చింతా వివేక్ పెమ్మిరెడ్డి కోటి గుర్రాల దనకాసులు శీలం సూర్యప్రకాష్ రావు పాలెపు తేజ గ్రామస్తులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
