భీంగల్ మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్
భీంగల్ మున్సిపల్ పట్టణంలో ఏర్పాటు నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను నిజామాబాదు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ ఈ రోజు గురువారం రోజున భీమ్ గల్ మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి నామినేషన్ ప్రక్రియ ను పరిశీలించారు.. నామ పత్రాల స్వీకరణ నిబంధనలకు అనుకూలముగా పూర్తి చేశారు వార్డు స్థానాలకు ఎన్ని నామినేషన్ దాఖలు అయ్యాయి తదితర వివారాలను అడిగి తెలుసుకున్నారు నామ పత్రాలు తెలుగు ఆంగ్లం హిందీ భాషలో అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు
పలు సూచనలు జారీ చేశారు.. వెంట సబ్ కలెక్టర్ కమీషనర్, తహసీల్దార్, ఎంపీడీ ఓ మరియు సిబ్బంది ఉన్నారు
