PS Telugu News
Epaper

12న జరగనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి.

📅 29 Jan 2026 ⏱️ 6:57 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి29(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)

సిఐటియు యాడికి మండల కమిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ యాడికి మండలంలో లక్ష్మీ చెన్నకేశవ స్వామి గుడి ఎందు సిఐటియు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఉమా గౌడ్ ముఖ్యంగా అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, కార్మికుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు.కార్మికుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతున్న లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ధరల పెరుగుదలను నియంత్రించాలని, కార్మికులకు కనీస వేతనం, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం సిఐటియు యాడికి మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు.అధ్యక్షురాలిగా లక్ష్మీదేవి, కార్యదర్శిగా మహాలక్ష్మి,గౌరవ అధ్యక్షులుగా మాయకుంట్ల మోహన్, ట్రెజరర్‌గా రాజ్యలక్ష్మిను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా 20 మంది కమిటీ సభ్యులను కూడా ఎంపిక చేశారు.నూతనంగా ఎన్నుకున్న కమిటీ ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మెను యాడికి మండలంలో ఘనంగా జయప్రదం చేయడానికి కృషి చేస్తుందని నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సి.ఐ.టి.యు.భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి హనుమంత్ రెడ్డి, సీనియర్ నాయకులు బషీరాబాద్, పెద్దన్న, శ్రీనివాసులు, యాడికి మండలం జిల్లా సి.ఐ.టి.యు.లో నూతనంగా బండారు రాఘవ, శివన్న, నబి రసూల్ చేరారు.

Scroll to Top