తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం ‘మహా పాపం’.. వైసీపీ నేతలది క్షమించరాని నేరం: ఎమ్మెల్యే ఆనందరావు…. గుత్తులు సాయి
పాయ నించే సూర్యుడు జనవరి 29 ముమ్మిడివరం
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన సింథటిక్ నెయ్యిని వాడటం కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని, ఇదో మహా పాపమని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ధ్వజమెత్తారు. అమలాపురంలోని మహిపాల వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ‘మహా పాపం నిజం’ పేరుతో ఉన్న కరపత్రాలను ఆయన ప్రదర్శించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూ ప్రసాద తయారీలో నాణ్యమైన నెయ్యికి బదులుగా పామాయిల్, కెమికల్స్, జంతువుల కొవ్వు కలిపిన ద్రవాన్ని వాడారని సిట్ (ఎస్ ఐ టి) దర్యాప్తులో తేలిందని ఆయన పేర్కొన్నారు.కరపత్రంలోని వివరాలను ఉటంకిస్తూ.. 2021-2024 మధ్య కాలంలో సుమారు 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యిని సరఫరా చేశారని, అది అసలు నెయ్యే కాదని మండిపడ్డారు. ఆ కల్తీ నెయ్యితోనే 20 కోట్ల లడ్డూలను తయారు చేసి భక్తులకు అందించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో వైసీపీ పెద్దలు రూ. 251 కోట్లను తమ జేబుల్లో వేసుకున్నారని ఎమ్మెల్యే ఆనందరావు తీవ్ర ఆరోపణలు చేశారు. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇటువంటి అక్రమాలకు పాల్పడటం ఘోరమని ఆయన అన్నారు.ఈ కార్యక్రమం లో జిల్లా టిడిపి అధ్యక్షులు గుత్తుల సాయి,అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, రాజోలు టిడిపి ఇంచార్జి గొల్లపల్లి అమూల్య, డిసి ఎం ఎస్ చైర్మన్ పెచ్చేట్టి చంద్ర మౌళి, పి నియోజకవర్గం టూ మాన్ కమిటీ సభ్యులు మోకా ఆనంద్ సాగర్ ,రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కంచిపల్లి అబ్బులు, ఆత్మా చైర్మన్ చిక్కం సుధ, సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం చైర్మన్ పేరూరి విజయలక్ష్మి, పెచ్చేట్టి విజయలక్ష్మీ, నల్లా స్వామి, కర్రి దత్తుడు, బోనం సత్తిబాబు, మాడా మాధవి, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు వెంటు సుధీర్ , సీనియర్ నాయకులు విత్తనాల వెంకటరమణ, హాదశ నాగేశ్వర రావు, గండి హారిక, చింతా శంకర్ మూర్తి, నల్లా చిట్టి, వలవల శివ రావు, తిక్కా సరస్వతి తదితరులు పాల్గొన్నారు
