సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాసులును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా.
పయనించే సూర్యుడు జనవరి 31,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
నంద్యాల పట్టణం ప్రజాశక్తి సీనియర్ రిపోర్టర్ మరియు అక్రిడేషన్ కమిటీ సభ్యులు శ్రీనివాసులు గుండె సమస్యతో బాధపడుతూ ఇండస్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకుని పరామర్శించిన నంద్యాల మాజీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ బాషా. వీరితో పాటు వైసిపి రాష్ట్ర కార్యదర్శి దేశం సుధాకర్ రెడ్డి, వైసీపీ జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్ వెళ్లి పరామర్శించారు.అలాగే డాక్టర్ క్రాంతి చైతన్యతో మాట్లాడి శ్రీనివాసులుకి మంచి వైద్యం అందించాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కోరారు.వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చిన శిల్పా రవి.