బైంసా మండలం. వాలేగామ్ గ్రామంలో ఇనుపగుట్టలో నుండి అక్రమ మొరం తవ్వకాలను అడ్డుకున్న వ్యవసాయ కార్మిక సంఘం సిపిఎం నాయకులు
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి.
బైంసా మండలంలోని వాలేగాం గ్రామ శివారులోని 130 సర్వే నెంబర్ లో ప్రభుత్వ భూమిని పేదలు స్వాధీనం చేసుకొని కొంతకాలంగా భూ పోరాటం కొనసాగిస్తున్నారు. రెవెన్యూ అధికారులు మేం సర్వే చేసి మీకే ఇస్తామని అంటున్నారు .కానీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతున్న దానిని అడ్డుకోవడం జరిగింది. జెసిబి టిప్పర్లు పెట్టి మొరాన్ని దవ్వి ఇటుక బట్టీల కోసం తదితర వాటి కోసం తరలిస్తున్న సందర్భంలో భూ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ప్రజలు అడ్డుకున్నారు. జెసిబి టిప్పర్ ను వదిలి యజమానులు పారిపోయారు . రెవెన్యూ పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది అధికారులు వచ్చారు.వెంటనే ఈ వాహనాలను సీజ్ చేసి బండి ఓనర్ల పై కూడా కేసులు నమోదు చేసి అక్రమంగా భూమిని లెవలింగ్ చేయించుకున్న వారిని మట్టిని అక్రమంగా తరలించి అమ్ముకుంటున్నటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది .పేదలకు భూములు ఇవ్వడానికి రెవెన్యూ అధికారులకు చేతులు రావు కానీ అక్రమంగా మట్టి విక్రయాలు చేస్తున్న వారితో కుమ్ముక్కై యదేచ్చగా దందాలు సాగిస్తారు .వెంటనే మట్టి తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని ప్రభుత్వాధికారులను మేము డిమాండ్ చేస్తున్నాం .ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్ ,జిల్లా అధ్యక్షులు డాకూర్ తిరుపతి ,రైతు సంఘం జిల్లా కార్యదర్శి నాగెల్లి నరసయ్య ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తిమ్మాపురం ముత్తన్న ,వాలేగాం భూ పోరాట కమిటీ అధ్యక్షురాలు కూతాడి విజయ ,కార్యదర్శి బీరోళ్ళ నవీన్ తదితరులు పాల్గొన్నారు.
